బ్రతుకుతెరువు కోసం
వృత్తిని ఎంచుకున్నట్లు!
బ్రతుకుదరువు కోసం
చదువును ఎంచుకుంటాం!!!
ఉద్యోగం కోసం కాక
విజ్ఞానం కోసం
చదువును ఎంచుకుంటే
ఆ అవకాశం ఉద్యోగం కోసం చదివే వాళ్లకు
ఉపయోగపడుతుంది!!
ఇక్కడ
చదివిన వాళ్లందరికీ
ఉద్యోగం రానట్లే
విజ్ఞానం కోసం చదువుకునే వాళ్లకు
ఒక అవకాశం ఇవ్వాలి
ఒక విద్యాసంస్థ ఉండాలి!!?
చదివిన వాళ్ళందరూ
ఉద్యోగం చేయలేకపోవచ్చు
కానీ
విజ్ఞానాన్ని కుటుంబానికి
సమాజానికి సగం పంచవచ్చు!!!
అట్లాగే
విజ్ఞానం కోసం చదివిన వాళ్లంతా
తరువాతి తరాలకు
చదువును విజ్ఞానాన్ని పంచవచ్చు!!!
వృత్తి ఉండి
చదువు లేని వారి కోసం
ఒక విద్యాసంస్థ ఉంటే బాగుంటుంది!!!
వృత్తి నైపుణ్యాలు చదువు
సగం మంది కన్నా చేరుతుంది!!?
దీనివల్ల
చదువుకోవాల్సిన వారు
వృత్తి కావలసినవారు
విజ్ఞానం కావలసినవారు
ఉద్యోగం కావలసినవారు
అది కాకపోతే ఇది
ఇది కాకపోతే అది అని కాక
ఒక నిబద్ధత ఒక స్పష్టత ఉండాలి!!!
సమయము డబ్బు వృధా కాదు
ఆ అవకాశం
మరొకరికి ఉపయోగపడుతుంది!!!?
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి