* కోరాడ మినీలు *

   @  కొత్తమోజు @
             @@@@@
కొత్త కేలండర్ వచ్చేసరికి.... 
   పాత కేలండర్ ను 
     తీసి బయట పడేస్తున్నారు !
    పెళ్ళాం వచ్చినవెంటనే... 
     అమ్మను పట్టించుకోకుండా 
       పక్కకు నెట్టేసినట్టు... !!
         *******
         @ నేడు - రేపు @
             *****
కొత్త కేలండర్ల లా.... 
 కొత్తకోడళ్లుమురిసిపోతున్నారు
 ఇంటి పెత్తనం తమదేనని !
   రేపు వీళ్లూ, అత్తలౌతారని 
    మరచిపోయి..... !! 
      *******
      * అవసరంతీరింది *
         ******
పాత బూజుని దులిపేసి.... 
  కొత్త ముస్తాబులు... 
  పాతకేలండర్లు పెంటమీదికి
    కొత్త కేలండర్ వచ్చిందిగా 
      దీని అవసరం తీరింది !
      వస్తువులైనా,మనుషులైనా
        అంతే మరి.... !!
     *******
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
ఆడపిల్ల అంటే అర్థం!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం
చిత్రం ; ఇమ్రాన్--7వ తరగతి
చిత్రం