సజ్జకము... సజ్జనము
******
"సజ్జకమైన సూర్యోదయ , సూర్యాస్తమయ అందాలను చూస్తే జీవితం మీద ఆశ పుడుతుంది. నిరాశా నిస్పృహలు ఆమడ దూరం పరుగెడతాయి" అంటారు ఓ కవి.
"ఆకులో ఆకునై పూవులో పూవునై ఈ అడవి సాగిపోనా.... ఇచటనే ఆగిపోనా" అని పరవశంతో పాట రాస్తాడు మరో కవి.
సజ్జకముతో మన మనసుల్ని, అంతరంగాలను ఆకట్టుకునే శక్తి ఈ ప్రకృతికి ఉందనేది అర్థమవుతుంది.
మరి సజ్జకము అంటే ఏమిటో చూద్దాం... మనోహరము,కమనీయము,గమకము,మంజులము, మనోజ్ఞము,మనోరంజనము,రమ్యము,హృదయంగమము, ఒంపు,పసందు, రమణీయము,నయగారము,విమలము,లలితము,సలలితము లాంటి అర్థాలు ఉన్నాయి.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే ఇలా ప్రకృతి,ప్రపంచం చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన మొదలవుతుంది. ఆ ప్రశాంతత సజ్జనము వల్లనే లభిస్తుంది.
సజ్జనము చేస్తే సాధించలేనిది ఏదీ లేదు.సజ్జనమే సంతోషానికి, విజయానికి మూలకము.
అలాంటి సజ్జనము అంటే ఏమిటో చూద్దాం...ప్రయత్నము, ఉద్యమము కదలిక,ప్రయాసము, ప్రయోగము, యత్నము,సన్నాహము,సంయమము, పూనిక... ఇలా అనేక అర్థాలు ఉన్నాయి.
మనమూ సజ్జకమైన మనసు కలిగి మంచితనం మానవతా పరిమళాలతో గుబాళిద్దాం.సజ్జనముతో అనుకున్న మంచి పనులు ఎన్నో సాధించి చూపుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి