నా లోని నీవు;- సుమ కైకాల
నిన్ను చూసింది ఒక్కసారే
కానీ కొలువున్నావు మది గూటిలో
కానరాని నీ అడుగు జాడలకై
ఎక్కడని వెతకను?...

ఒకోసారి అనిపిస్తుంది
నిన్ను మరచిపోవాలని
ఆ ఊహే చీకట్లోకి నెట్టేస్తుంది
నీవే నా జీవితానికి వెలుగు!...

కామెంట్‌లు