ఉగాది బాలల కథల పోటీ కొరకు విద్యార్థులు వ్రాసిన కథలకు ఆహ్వానం

 తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే  ఉదేశ్యం   తో  సిద్దిపేట జిల్లా లోని ప్రభుత్వ  మరియు ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్న విద్యార్థులనుండి కథలను ఆహ్వానిస్తున్నామని సుగుణ సాహితి సమితి కన్వీనర్ భైతి దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు.ప్రథమ బహుమతి 1500 రూపాయలు,ద్వితీయ బహుమతి 1000 రూపాయలు, రెండు తృతీయ బహుమతులు500 రూపాయలు చొప్పున మరియు 300 రూపాయలు చొప్పున 10 ప్రత్యేక బహుమతులను ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు మర్పడగ చెన్నకృష్ణారెడ్డి అందిస్తున్నారు.హామీ పత్రంతో పాటు  విద్యార్థులు తాము వ్రాసిన కథలను "కన్వీనర్, ఉగాది కథల పోటీ,ప్రతిభ డిగ్రీ కళాశాల, మెదక్ రోడ్ సిద్దిపేట-502103 చిరునామా కు  2023 జనవరి, 31వ తేదీలోగా  స్వయంగా,రిజిస్టర్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపగలరు.పూర్తి వివరాలకు 9959007914 సెల్ నంబర్ లో సంప్రదించవచ్చునని తెలిపారు.
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం