సుప్రభాత కవిత ; -బృంద
ప్రకృతి  కాంత పెదవంచున
మెరిసిన వెలుగుల  నవ్వులా

నింగి ముంగిట మబ్బుల
రంగవల్లికలా...

చివురుటాకుల  చివర
కురిసి మెరిసే మంచులా...

ఎదురుచూసే ఎదలో
కుదురులేని కమ్మని నిరీక్షణ లా

తడబాటెరుగని అడుగుల
మధ్యలో  సయోధ్యలా...

మూగప్రేమను మౌనరాగమై
పలికించే మౌనవీణలా

కనురెప్పల తలుపులు మూసి 
ఇష్టంగా కలలు కనే కోరికలా...

తెలిసీ తెలియని మనసులోని
తేటగా వున్న ప్రేమలా

విరిసీ విరియని మల్లెల
మదిలో నిండిన పరిమళంలా

పాలు ఒలకబోసినట్టు
పరచుకున్న వెన్నెలలా

తెల్లవారిన వేకువ తెచ్చిన
వెలుగుల పండుగలా

ఏతెంచిన ఉదయానికి
ఉత్సాహంగా 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు