నిరంతరం బాలల సృజన కోసం, బాలల వికాసం కోసం మొలక మాసపత్రిక , అంతర్జాల పత్రిక కృషి చేస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కుకుడాల గోవర్ధన్ అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో జరిగిన బాలల కథల బడి కథా రచనా కార్యశాలలో భాగంగా బాలల మొలక మాసపత్రికను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో విధిగా మొలక పత్రికను విద్యార్థుల చేత చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు. పిల్లల సృజనకు పెద్దపీట వేస్తున్న సంపాదకులు వేదాంత సూరి అభినందనీయులు అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి పి వెంకులు, సాహితీ కౌముది మిర్యాలగూడ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రముఖ రచయిత్రి ఉప్పల పద్మ,, సృజన సాహితీ అధ్యక్ష కార్యదర్శులు పెరుమాళ్ళ ఆనంద్ సాగర్ల సత్తయ్య బాలలను సృజన శీలురుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులు దాసరి శ్రీరాములు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మొలక బాలల పత్రిక ఆవిష్కరణ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి