దురాశ! ;-అచ్యుతుని రాజ్యశ్రీ

 దురాశ దుఖాన్నికి చేటు.కష్టపడి సంపాదించినదే మిగులు. శివయ్య కష్టజీవి.భార్య గయ్యాళి.ఒక్క పని చేసేది కాదు."దరిద్రపు కొంప!అచ్చట ముచ్చట లేదు. భార్యను పోషించలేనివాడివి పెళ్లి ఎందుకు చేసుకున్నావు?" అని సాధించేది.ఆరోజు  అన్నం కూడా వండలేదు ఆమె. కాలే కడుపుతో అడవిలో కట్టెలు కొడుతూ సొమ్మసిల్లిపోయాడు. ఓసాధువు  అతనికి శైత్యోపచారాలు చేసి పళ్ళు తినిపించాడు."స్వామీ! నాకు జీవితం పై విరక్తి పుడుతోంది.నాభార్య తిడుతుంది అసమర్థుడి నని!" .సాధువు నవ్వి"ఈభరిణ రోజూ నీవు రాత్రి నిద్రపోయే ముందు  ఓవెండి నాణెం ఇస్తుంది. పనిచేసిన రోజు మాత్రమే సుమా! దీని మూత తీయకు.నీభార్య ను కూడా నీకు సాయపడమని చెప్పు" అనగానే  శివయ్య ఇంటికి వెళ్లి అంతా భార్యకి చెప్పాడు.ఓనాలుగురోజులు పనిచేసి ఆమె దురాశ తో ఓరోజు  భరిణమూతను బద్దలు కొట్టింది.అంతే దాని మహిమ పోయింది. శివయ్య విరక్తితో"నీఖర్మ నీవు అనుభవించు.నేను సాధుసేవ భక్తి లో నాజీవితం గడిపేస్తా" అని వెళ్లి పోయాడు. చెప్పినాక వినకుంటే చెడినాక చూడాలని సామెత 🌹
కామెంట్‌లు