బుల్లెట్ పాయింట్స్ 🔷.బాపు జన్మదినo ;--ఎం. వి. ఉమాదేవి ;-బాపూ బొమ్మకి అనుసృజన -కామేశ్వరి
కొంటెబొమ్మల బాపు 
నవ్వించే కళారూపు !

బాపూ రమణీయం 
మనోహర దృశ్యకావ్యం !

రేఖల్లో మహాపొదుపు 
అభిమానులకేది అదుపు!? 

బుడుగు బొమ్మలేసేరు 
అడుగడుగునా నవ్వించేరు!

నోట్లో తీయనిపైపు 
గీతల్లో మహాకైపు !

ముత్యాలముగ్గు వేశారు 
తెలుగోళ్ళెంత మురిసారు !

తెలుగమ్మాయి బాపూబొమ్మ 
సాటిలేనే లేరమ్మ !

దేవుళ్ళు సజీవచిత్రాలు 
బాపూ మేథోపత్రాలు !

పాత్రసృజన దివ్యము 
మాటలెంతో భవ్యము !

విడదీయలేని స్నేహము 
బాపూరమణల భాగ్యము 


కామెంట్‌లు
Unknown చెప్పారు…
👏👏👏💐💐
Unknown చెప్పారు…
👏👏👌👌💐