పద్మ శ్రీ బందా (15);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వింజమూరి శివరామారావు గారు రాసిన హంసభిక్షకులు  నాటకంలో నేను నండూరి సుబ్బారావు గారు, సి.రామ మోహన్ రావు గారు ఎం నాగరత్నమ్మ గారు, ఎన్.సి.వి జగన్నాథాచారులు గారు పాల్గొన్నాం.  దాని నిర్వహణ బందా గారే. బందాగారికి మొదటి నుంచి పౌరాణికలు అంటే చాలా ఇష్టం. నేమాని వెంకట కోటేశ్వర శర్మ గారితో సంప్రదించి  వ్యాసభారత ఆధారంగా లక్క ఇల్లు గంట నాటకాన్ని రాయించారు దానిలో నేను  వేమూరి శ్రీధర్ రావు బందా గారు లాంటి  దిగ్గజాలు పాల్గొన్నాము. శ్రీధర్ రావు రేడియో లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు రంగస్థలం మీద భీముని పాత్రకు ఆయనే తగినవాడు  పౌరాణిక ఏక పాత్రలను వినిపించేవారు  ఇందులో బందాగారు కృష్ణ పాత్ర పద్యాలు పాడడం  ఆయన రంగస్థలం మీద ఎలా ప్రదర్శించే వారు ప్రత్యక్షంగా మేము చూశాం.పౌరాణికాలలో ఎంత గొప్పగా రాణించారో సాంఘీకాలలో కూడా అంత మంచి పేరు తెచ్చుకున్న వారు బందా. ఏడిద కామేశ్వరావు గారు రాసిన లక్షలు, కోట్లు హాస్య నాటకాన్ని  నండూరి సుబ్బారావు గారు నాగరత్నమ్మ గారు  మధుసూదన్ రావు గారు కందుకూరి రామభద్ర రావు గారితో పాటు  నేను జగన్నాథ ఆచార్యులు గారు కూడా నటించాం. దానిలో రెండు వాక్యములు  పాత్ర బందా గారిది  గంగాధర్ రావు గారు వైద్యుడుగా ఎంతమందికి స్వస్థత ఇచ్చారో వారి ప్రహసనాల ద్వారా, నాటికల ద్వారా సమాజంలో  అంత సంచలనాన్ని సృష్టించారు.  రేడియోకు ప్రత్యేకంగా ఆయన వ్రాసిన ప్రజాయుద్ధం నాటకంలో బందా గారితో కలిసి నేను సి రామ్ మోహన్ రావు, సుబ్బారావు గారు పాల్గొన్నాం. బందాగారు వారు నిర్వహించే నాటకాలలోనే కాక మిగిలిన వారు ఎవరు పిలిచినా వెళ్లి తను కూడా నటించేవారు. రాహుల్  కృత్యాయన్ తో పరిచయం ఉన్నవారు బుచ్చిబాబు గారు. వారి మస్తిష్కంలో మెరిసిన అద్భుతమైన మెరుపు గాజు మేడ  షేక్స్పియర్ ఐన్స్టీన్ లాంటి ప్రఖ్యాత రచయితలు కవులు ఒకచోట గూడితే ఎలా ఉంటుంది అన్నది కథ. కథ అద్భుతం. అందులో నేను షేక్స్పియర్ కందుకూరి రామభద్ర రావు గారు ఐన్స్టీన్  బందా నండూరి సుబ్బారావు సి. రామ్మోహన్ రావు నండూరి పెట్టారు కె.వి.ఎస్ కుటుంబరావు గారలు మిగిలిన పాత్ర దారులు  వింజమూరు శివరామారావు గారు రాసిన నాటకం రామరాజు.సి రామ్మోహన్ రావు మిగిలిన నిలయ విద్వాంసులతో చేశాం  దానిలో బంధా గారి పాత్ర కూడా ఉంది.


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం