ఆ సభలో నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం నాకు తెలియకుండా బందా కనక లింగేశ్వర రావు గారు నాటకం మొత్తం చూసి సన్మాన సభలో వేదిక పైకి వచ్చి వీడు నా కళాకారుడు కనుకనే అంత బాగా నటించగలిగాడు ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ ప్రతి కదలికకు అర్థం చెబుతూ అందరి మన్ననలను పొందాడు. అలాగే చైర్మన్ గా నటించిన డాక్టర్ కె వెంకట రాజు గారు ఆ పాత్రకు జీవం పోశారు అని నాతో నాన్నా అరుణ నీకు ప్రాణం మనుషులు ఇద్దరూ వేరైనా ఇద్దరూ కలిసి ఒకటిగానే జీవించాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటున్నాను. ఆమె చుక్కానిలా సంసార సముద్రంలో మార్గదర్శిగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ జీవితం సుఖ సంతోషాలతో విలసిల్లాలని కోరుకుంటున్నాను అని దీవించిన తరువాత నేను అరుణ గురువుగారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నాం అంత ఉదాత్త మనస్తత్వం కలిగిన మహానుభావులు మా బందా వారి దగ్గర పని చేయడం నా అదృష్టం. మొదట్లో నండూరి విఠల్ గారు డ్యూటీ ఆఫీసర్గా చేస్తున్న సమయంలో ప్రతి నాటకంలోనూ ఆయన ప్రధాన పాత్ర పోషించేవాడు. అప్పటికి కుమారి శారద ( శారదా శ్రీనివాసన్) విజయవాడలో ఉంటూ ఆ కేంద్రంలో నాటక కళాకారిణిగా విఠల్ తో కలిసి అనేక నాటకాలలో పాల్గొంది. వారిద్దరి వల్ల చాలా నాటకాలు నిడిచాయి విఠల్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సి.రామ్మోహన్ రావు గారు కథానాయకుడు నేను వచ్చిన మూడవ రోజు నుంచి బందాగారు ప్రతి నాటకానికి నేనే కథానాయకుడిని. బందాగారి ప్రోత్సాహంతో సహకారంతో వారి నిర్వహణలో నాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి నేను చేసిన దానికి మెరుగులు దిద్ది నన్ను ఉత్తమ రేడియో కళాకారుడిగా తీర్చిదిద్దారు. అందుకు జీవితాంతం వారికి కృతజ్ఞుణ్ణి.
బందా గారితో నా అనుబంధం బాగా పెరిగిన తర్వాత కొన్ని నాటకాలు ఇచ్చి మంచి వాటిని ఎంపిక చేయమనేవారు. నేను చేసిన వాటిని అంగీకరించి తిరిగి వారు చూడకుండా వాటిని ప్రసారం చేసేవారు నాకు నచ్చని వాటిని తిరిగి రచయితకు పంపించేవారు. ఒకరోజు మాటల సందర్భంగా గురువుగారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగనా అంటే నీకు అనుమతి కావాలా ఏదైనా చెబుతాను అన్నారు. అది కాదు గురువుగారు ఆకాశవాణి బ్రాహ్మణులకు మాత్రమేనా మిగిలిన కులాల వారిది కాదా, వారు పనికిరారా అని అడిగినప్పుడు సుబ్బారావు గారు కూడా ప్రక్కనే వుండి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. అబ్బాయి నీ ప్రశ్న సరికాదు అన్నారు. అదేమిటండి సరిగానే అడిగానుగా అన్నాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి