ఆచరణీయం (2);-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ప్రతి ఇంటిలోనూ ఇంటి పెద్ద  ముసలితనంతోనే ఉంటారు. జీవితంలో ఎన్నో అనుభవాలను పొంది  జీవితం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న నిర్ణయం తీసుకొని  ప్రత్యేకంగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు  అలాంటి వారికి ఇంట్లో ఎవరు ఏ చిన్న పని చేసినా దానిలో చాలా తప్పులు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసి వీటిని చూసుకుంటూ ఉంటారు.  ఒక్కోసారి నోరు చేసుకుంటారు  చిన్నపిల్లలు అయితే చేయి కూడా చేసుకుంటారు. వేరే ఇంటి నుంచి నూతన వధువు ఈ ఇంటికి వచ్చినప్పుడు  ఆమె ప్రవర్తన వీరికి తెలియదు వారి ప్రవర్తన గురించి ఇది కొత్త ఇల్లు కాదమ్మా ఇది నీ సొంత ఇల్లు  ఇవాల్టి నుంచి నీవు మా బిడ్డవు  ఇంటి బాధ్యత మొత్తం నీవే చూసుకోవాలి  పరువు ప్రతిష్టలను కాపాడవలసిన బాధ్యత నీదే అని అత్తగారు చెప్పినప్పుడు  ఆ కోడలు ఎంత ఆనందిస్తుంది.  ఆమె కూడా సొంత కూతురు లాగా ప్రవర్తించదా  తన తల్లిని తండ్రిని ఎలా చూసుకుందో అత్తా మామల్ని కూడా అలాగే చూసుకుంటుంది కదా  దానివల్ల పరస్పరం ఇద్దరికీ ప్రేమ అభిమానాలు పెరుగుతాయి ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది  ఇతరులకు ఆదర్శంగా కూడా ఉంటుంది. సామాన్యంగా ఇంటి పెద్దకు  ఆ ఇంట్లో జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకోవాలని వాటిని సక్రమమైన మార్గంలో నడిపేందుకు ప్రయత్నించాలని  ఆరాటం, ఉబలాటం ఉంటాయి. అయితే తరం మారిన తర్వాత వాళ్ళ  ఆలోచనలు కోర్కెలు  వేరేగా ఉంటాయని వారి మనసుకు తోచదు తోచినా అంతగా పట్టించుకోరు  ప్రతిదాల్లోనూ వారు వేలు పెట్టి  అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని  వారు సలహాలు ఇస్తూ ఉంటే  యువతరానికి ఎలా ఉంటుంది  ఏమిటి ఈ ముసలి వాళ్లు  ప్రతిదానికి తగుదునమ్మా అంటూ మనకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా వారికి సలహాలను ఇస్తూ ఉంటే  నా భార్య దగ్గర నా ఆలోచనలకు నా పద్ధతులకు  ఏమాత్రం గౌరవం ఉంటుందో ఆలోచించను కూడా ఆలోచించారా? ఇంత వయసు వచ్చి ఆ మాత్రం తెలియదా  
ఆ కుర్రవాడికి ఎలా ఉంటుంది దానితో మాట పెరగడం  పాతవి కొత్తవి అన్ని విమర్శించుకుంటూ రాద్ధాంతం చేయడం  దానివల్ల కుటుంబం బజారుకు రావడం తప్ప మంచి ఏమైనా జరుగుతుందా దీనికి పరిష్కారం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచిస్తే  పెద్దలు ప్రతి దానిలోను జోక్యం చేసుకోకుండా తమ పనులేవో తాము చేసుకుంటూ తనకు కావలసిన అవసరాలను తీర్చుకుంటూ ఉంటే  ఆ సంసారం ఎంతో శాంతివంతంగా  ప్రశాంతంగా ముందుకు వెళుతుంది.
ఆ ఇంట్లో ఆడపిల్లకు కానీ మగ పిల్లవాడికి కానీ  వివాహం చేయాలని తల్లిదండ్రులు అనుకున్నప్పుడు  సంబంధాలు వారిని వీరు చూసుకోవడం  ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం  ఇలా అయితే చేసుకుంటామని వాళ్లు నియమాలు పెట్టడం  అలా కాదు ఇలా అయితే బాగుంటుందని వీరు సమర్ధించుకోవడం  అలా మాట్లాడుకుంటున్న సమయంలో ముసలివాడు జోక్యం చేసుకొని  అలా చేస్తే బాగుంటుందిరా అబ్బాయ్  ఇలా కూడా బాగుంటుంది కానీ దీనికన్నా అదే బాగుంటుంది  లాంటి సలహాలిస్తే అతనికి ఎలా ఉంటుంది  అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని  పిల్లల ఆగ్రహానికి గురై తీరికగా విచారిస్తూ బాధపడుతూ  చివరకు మంచం పట్టవలసిన స్థితికి వస్తే  మళ్లీ ఆ ముసలి వారిని చూడవలసినది వాళ్లే కదా  మరి ఆ వయసులో ఏమీ తోచని పనులు ఎందుకు చేయడం  అనవసరంగా ఎందుకు కష్టాలు తెచ్చుకోవడం  కృష్ణా రామా అంటూ తన పనులు తాను చేసుకోవచ్చు కదా.


కామెంట్‌లు