నటనకు వ్యాకరణం బందా గారు (39) - ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 బందా గారు  వాల్మీకి మహర్షిని అధ్యయనం చేసిన వాడుగా కనిపిస్తారు నాకు.  రాముని ద్వారా  ఎదుటివారితో ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని చెప్పించినప్పుడు  వారు ఏ సూత్రాలను చెప్పారో వాటిని తూ.చా. తప్పకుండా  బందాగారు పాటించడం  నేను గమనించాను  మాట్లాడే విధానం  ప్రతి అక్షరం లోను స్పష్టత ఉండాలి  విషయంలో అంతే స్పష్టత కనిపించాలి  తనలో తాను గొణుక్కోకుండా అరవకుండా  ఎదుటివారు ఏ స్థానంలో ఉన్నారో గమనించి ఆ స్థాయికి సరిపడిన శృతిని మాత్రమే  ఉపయోగించి మాట్లాడాలి. ఎవరిని గురించి చెడుగా చెప్పే  మాటలు  అర్ధాంతరన్యాసలో చెప్పాలి తప్ప  ఎదుటివారి మనసులు నొచ్చుకునేలా చెప్పకూడదు  అని వాల్మీకి మహర్షి చెప్పిన అన్ని విషయాలను ఈయన  అనుసరిస్తారని నా అనుభవంలో గమనించాను.
ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు వారు వైరి వర్గంలో  ఉన్నా వారిని అభినందించడం  బందా గారికి అలవాటు అలాగే మాకు నటన గురించి  వ్యక్తిగత విషయాలు చెప్పేటప్పుడు కూడా నేను నండూరి సుబ్బారావు గారు ఉన్నప్పుడు చెప్పే రహస్యాలు వేరు  అదే మూడో మనిషి రామ్మోహన్ రావు లాంటి వారు ఉంటే  అన్ని విషయాలు చెప్పరు. వారికి నమ్మకం కుదరకపోతే  వారితో హాస్యాలు కూడా మాట్లాడటం. లేకపోతే తగ్గిస్తారు. ఒక సందర్భంలో అక్కినేని నాగేశ్వరావు గారిని  ఎంత మెచ్చుకున్నారంటే  ఆయన ఆహారంలో కానీ  విహారంలో కానీ  పాటించే క్రమశిక్షణ వీరికి చాలా ఇష్టం  మనమందరం రేడియోలో పని చేసేవాళ్ళం. గొంతు సరిగా ఉంటే చాలు  దానిని ఆరోగ్యంగా ఉంచటం మన బాధ్యత  కానీ వారిది మన లాగా కాదు  వారిది దృశ్య కావ్యం  వ్యక్తి కనిపించాలి గొంతు వినిపించాలి  ఆ రెండు రకాల ఆరోగ్యాన్ని పాటించాలి.
శరీర ఆకృతి మారుతుందన్న దృష్టితో  కొవ్వు పదార్థాలకు  ఆయన ఆహారంలో స్థానం ఉండదు. ఉదయం వారు తీసుకునే ఆహారం  ఆవిరి తో ఉడకపెట్టిన కుడుం అలాగే మిగిలిన విషయాలలో కూడా  మితాహారం పాటించటం  ఆయనకు అలవాటు.  పాత్రోచితంగా నటించడం వేరు  ప్రవర్తించడం వేరు  మనకు నటిస్తే చాలు  వారు  నటనతో పాటు ప్రవర్తనను కూడా మార్చుకోవాలి  ఉదాహరణకు దేవదాసు సినిమా  జరుగుతున్న సందర్భంలో వేదాంతం రాఘవయ్య గారు  నాగేశ్వరావు గారితో తాగుబోతు వేషం వేయించి  ఆ దృశ్యాలు తీయడానికి వారం పది రోజుల క్రితం  నాన్నా శరీరాన్ని కూడా దీనికి తగినట్లుగా మలచుకోమని చెప్పినప్పుడు  భోజనాలు కూడా మానేసి  దేవదాసుకు సరిపడిన  ఆకారం కోసం ఎంతో ప్రయత్నం చేశాడు  అతని సినిమా చూస్తుంటే  అతని కృషి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నటుడు అలా ఉండాలి అంటారు బందా. 

కామెంట్‌లు