డ్రగ్ కాన్సన్ట్రేషన్;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఇదేదో కొత్త పదంగా ఉందని ఆలోచిస్తున్నారా? అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే బాడీలో మనం వేసుకున్న టాబ్లెట్ బ్లడ్ లో డిస్ట్రిబ్యూట్ అయిన శాతాన్ని ఈ డ్రగ్ కాన్సన్ట్రేషన్ అని అంటారు.
సరి సరేలే కానీ.... మాకెందుకు ఈ టెర్మినాలజీ అంతా చెబుతున్నారు అని అనుకుంటున్నారా...? చెప్తా చెప్తా... అన్ని డిసీజెస్ ఒకే లాగా ఉండవండి. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చిందనుకోండి
మనం పారాసెటమాల్ వేసుకుంటాం ఒక రెండు మూడు రోజులకి ఫీవర్ తగ్గిపోతుంది. అదే మనకి ఏదైనా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నాయ్ అనుకోండి అంటే
మెడికల్ థెరపీ అనేది ఎక్కువ కాలం పాటు తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని కోర్స్ డ్యూరేషన్ అని చెప్తుంటారు.
అయితే కోర్స్ ని కంప్లీట్ గా 
వాడకపోయినా, అన్ కాంప్లియన్స్ గా ఉన్నా 
సింటమ్స్ మరింత ఎక్కువై ఫర్దర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే
"సీజర్స్". ఫిట్స్ తగ్గించడానికి
యాంటీ ఎపిలెఫ్టిక్స్ ని ఇస్తారు.
వీటి డ్రగ్ కాన్సన్ట్రేషన్ బ్లడ్ లో తగ్గిందంటే తరచుగా ఫిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది.
పిల్లలకైతే ఈ లక్షణాలు ఒకటి రెండు డోసులు మిస్ అయినా సరే వెంటనే తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లలకు యాంటీ ఎపిలెఫ్టిక్స్ ని డైలీ డోసులు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకుండా
బాడీలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ ని మైంటైన్ చేస్తూ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
లేదంటే బ్రేక్ త్రూవ్ సీజర్స్ కి
గురికావాల్సి ఉంటుంది.
డ్రగ్ కాన్సన్ట్రేషన్ బాడీలో తగ్గడం వల్ల పదేపదే సీజర్స్ రావడం దాంతో పిల్లలు వెక్స్ అయి పోవడం జరుగుతుంది.
దాంతో పిల్లల ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది కనుక 
జాగ్రత్త వహించండి....కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం