మానవుడు ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం ఈ ప్రకృతి అతనికి అన్ని తనకు సమకూర్చి పెడుతుంది దాని మూల రహస్యం తెలుసుకునే మనిషి దేనికోసము అసంతృప్తితో వెతకడం కోసం ప్రారంభం చేస్తాడు దీనికోసం ఈ వెతుకులాట అన్న విషయం కూడా అసలు గ్రహించడు మనిషికి మనసు ముఖ్యం అది అనేక ఆలోచనలకు పుట్ట ఆ మొత్తాన్ని చిన్న మెదడు మెదడుకు అందిస్తుంది. అనేక పనికిరాని ఆలోచనలను ప్రక్కన పెట్టి ఒకటి రెండు లేక మూడు విషయాలను మెదడుకు పంపిస్తుంది ఆ రెండు మూడిట్లో ఏది అనుసరణీయమైనది ఏది అవసరమైనది ఆలోచించి మిగిలిన వాటిని తీసి వేసి ఏది ఈ మనిషి లోపల అంతర్వేదంగా జ్యోతి ఆకారంలో దానిని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేయమని హెచ్చరిక చేస్తూ ముందుకు సాగుతుంది శరీరం ఏ కుటుంబంలోనైనా కలహాలు రావడానికి మూల కారణం ఎవరైనా ఆలోచించారా రెండు భిన్న సంస్కృతుల నుంచి వచ్చిన స్త్రీ పురుషుల సంగమం కుటుంబ వ్యవస్థ చిన్నతనం నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెరిగినా ఆడపిల్ల అత్తవారింటికి వచ్చిన తర్వాత ఒక్కసారి క్రమశిక్షణయుతమైన జీవితాన్ని అనుసరించా లంటే పద్ధతి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది ఆమె అలవాటుపడే లోపే ఇటు భర్త అటు ఆడబిడ్డలు ఇటు అత్తమామలు ఏదో ఒక పేరుతో అలా చేస్తున్నావు ఏమిటి ఇలా కదా చేయవలసింది ఇక్కడ పద్ధతులు అలవాటు చేయకపోతే ఎలా అని ఎద్దేవ చేస్తూ సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతయినా కూడా మనిషి కదా ఆవిడకి మనసు ఉంటుంది ఆ మనసు తప్పకుండా బాధపడుతుంది ఆ బాధలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆ సమయంలో బలహీనపడిన మనసుకు రకరకాల ఆలోచనలు వస్తాయి అత్తవారింటి దగ్గర నుంచి పుట్టింటికి తన బాధను చెప్పుకొని ఉపశమనం పొందినట్లయితే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన చేసి అలా చేయడం వల్ల ఈ కుటుంబంలో నేను వారికి ద్రోహం చేసినట్లు కదా మరి ఏదో తప్పు చేసినట్లుగానే వారు భావిస్తే నా జీవితం ఏమవుతుంది అలా కాకుండా రైలు కింద పడి కానీ నదిలో దూకి గాని ఉరి వేసుకుని కానీ చనిపోతే ఎలా ఉంటుంది నా గురించి మాట్లాడేవారు ఇంకా ఎవరూ ఉండరు కదా అయినా చనిపోయిన తర్వాత మనల్ని ఎవరు ఏమంటే మాత్రం ప్రయోజనం ఉంది తనకు ఏమైనా వినిపిస్తాయా ఆ మాటలు అన్న ఆలోచన వచ్చినప్పుడు దేనికి ప్రథమ స్థానం ఇస్తుంది ఆ స్త్రీ ప్రతిష్టను వదిలి తన చీరతో గొంతు బిగించుకుని ఉరి వేసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదు అనుకుని అలాంటి అఘాయిత్యానికి పూనుకుంటుంది.
కాస్తా ఆలోచించండి ; -డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి