అంబేద్కర నీ ఆశయం
ఎంతో ఉన్నతం
సామాన్యులు చేరుకునే
ఉన్నత శిఖరం
బానిస భారతావనికంత
భవిష్యుత్తునిచ్చె రాజ్యాంగం
అదెంత ఉత్క్రుష్టమో
దేశజనని జనులకంత పంచే ఆనందం
మనువాదాన్నంత సమాదిచేసి
మనుష్యులగ తీర్చే
బహుజనులనందరిని బలవంతులుజేసే
కులమతాలకతీతంగ
అవకాశాలనందించే
భరతమాత గర్వించగ
విశ్వమంతా హర్షించగ
విజయమునిచ్చే
కానీ.....
నీవు కలలగన్న బహుజన భారతం
కలగానే మిగిలింది
సామాన్యులచేతిలో నీవుంచిన "ఓటు"
అంగడి సరుకయ్యింది
సామాన్యులకధికారం
అందని ద్రాక్షయ్యింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి