శుభాశితములు;-గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.సెల్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
మాటిమాటికి తన మనసును
మార్చుకునే గుణం ఉన్నవాడు
మునుముందుకు సాగలేడు
కార్యసాధకుడిగా తను మారడు !

శక్తి కోసం భుజించాలి
ముక్తికోసం భజించాలి
యుక్తికోసం యోచించాలి
భక్తి కోసం శ్రమించాలి !

కోరి కోరి కర్మ చేయలేక ఉండి
వారి కర్తవ్యం నిర్వహణ నుండి
తప్పుకొని పారిపోయేవారండి
తప్పక సోమరులవుతారండి

మొరిగే కుక్క కరవదు
కరిచే కుక్క మొరగదు
అని అనుకొనుట తప్పు
కని తప్పించుకో ముప్పు !

ధనము సంతోషం సంతానం
రాజ్యం బోజ్యం రాణివాసం
కోరని వాడు ఆర్థార్తుడు
కోరుకునే వాడు ఆశార్థుడు !

ఎడా పెడా హామీలను ఇవ్వవద్దు
ఇచ్చావా అమలు చేయుట ముద్దు
ఇలాంటి అలవాట్లను చేసుకోరద్దు
చేసుకోక ఉండి గంగ పాలు కావద్దు 

గొంతుందని వితండవాదం వద్దు
అంతు చూసుకొని ప్రవర్తిస్తే ముద్దు
ఆ స్వభావమును చేసుకో ఇక రద్దు
చేయకుండా వుంటే చెడుట కద్దు

మాత బ్రహ్మ దేవునితో సమానం
పిత విష్ణుమూర్తితో సమానం
గురువు పరమశివునితో సమానం
నరుడు నారాయణునితో సమానం

మంచికి స్వాగతం పలుకు
చెడుకు వీడుకోలే గెలుపు
కష్టానికి కావాలి అలుపు
మదిలో నీ ఇష్టాన్ని తెలుపు

కామానికి కన్నులు లేవు
కావ్యానికి ఎల్లలు లేవు
తెలుసుకొని మసులుకో నీవు
స్థిరంగా నిలుపుకో నీ తావు


కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం