సత్వం ప్రధానం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఏ వ్యక్తి మంచితనమైనా అతని ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది  ఎదుటివారికి సహకరించడం కోసం చేతనైనంత సహాయం చేస్తూ  అనవసరంగా ఎవరి విషయాలలో జోక్యం చేసుకోకుండా  తన పని తాను చేసుకుంటూ  ఇతరులకు తన చేతన ఇదంతా  చేస్తూ జీవితాన్ని గడుపుతున్న వాడికి మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. నేను చాలా మంచి వాడిని చాలా గొప్ప వాణ్ణి అని తాను భావించి  తనను గురించి ఎక్కువగా ఊహించుకొని  ప్రవర్తించిన వ్యక్తులకు ఏమాత్రం గౌరవం లేదు ఎదుటివాడికి  ఏది ఎంత ఉన్నా తనకు కావలసినది అనుకూలత అణకువ ఉంటే ఎదుటివారికి చేతులు కట్టుకొని  వాడు చెప్పినట్లుగా చేయమని  కాదు అర్థం  అలా చేస్తే అది బానిస బ్రతుకు అవుతుంది తప్ప  తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకునేది మాత్రం కాదు  అన్నది స్పష్టం. కొన్ని మాధ్యమాల ద్వారా అనేక విషయాలను మనం ఫలానా వారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నారు  వారిని బతికించండి అని విజ్ఞప్తి చేస్తూ  తల్లిదండ్రులు ప్రకటనలు కూడా చేస్తూ ఉంటారు  నిజానికి ఎంతో సహృదయంతో  ధనవంతులు కోటి రూపాయలు అయినా పరవాలేదు  అతను  జీవించి ఉంటే చాలు అన్న సదభిప్రాయంతో  సహకరించేవారు కొంతమంది దాతలు ఉంటారు  అంత మాత్రం చేత అతని వ్యక్తిత్వాన్ని గొప్పగా  చెప్పుకునేవారు ఎవరు ఉంటారు అని మనకెందుకు లే అని ప్రక్కన పెట్టినట్లయితే  ఆ దాతకు ఎక్కువ కోపం ఉండి  దానితో చీకాకు పడుతూ ఎదుటివారిని అనరాని మాటలతో తూలనాడితే ఎవరు సహించగలరు  అంత సహకరించినా దాతృత్వం  అతని నోటి దురుసు వల్ల ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అలాంటి వారు సహనవంతులైతే ఎంత అందంగా ఉంటుంది.
పెద్దవాళ్లు ఒక మంచి వ్యక్తి గురించి చెప్పినప్పుడు అతను కులానికి తక్కువ వాడే కానీ  గుణానికి అందరికన్నా గొప్పవాడు అని పొగడడం గమనిస్తూ ఉంటాం  ఆస్తిపాస్తులు లేక రెక్కల కష్టంతో బ్రతికే  కుటుంబాలను ఎన్నిటిని మనం చూస్తున్నాం. అంత మాత్రం చేత వారు గౌరవ మర్యాదలు లేనివారా  నీవు ఏదైనా సహకరిస్తే దానిని అంగీకరించి తీసుకుంటారు కానీ  తక్కువగా మాట్లాడితే ఎవరైనా భరించగలరా  కనుక ఎదుటివారికి ఆత్మాభిమానం ఉంటుంది అనే జ్ఞానం లోపించినప్పుడు  ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కనుక అలాంటివి చేయవద్దు  సత్వ గుణాన్ని ఎవరు అలవర్చుకుంటారో వారిని మంచివారుగా  అందరూ గొప్పగా చెప్పుకుంటారు తప్ప  అలాంటి లోపాలను సరి చేసుకోండి అని వేమన మనకు సలహానిస్తున్నాడు ఆ పద్యాన్ని మీరు చదవండి.


"కోటి దానమిచ్చి కోపంబుచేయుచో పాటి చేయరతని  
ప్రజలు మెచ్చి సత్వగుణము చేత సజ్జనుండగునయా..."



కామెంట్‌లు