తారక నామ జపం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 భారతదేశానికి వెన్నెముక అని చెప్పుకో తగిన  రామాయణ గ్రంథకర్త  వాల్మీకి మహర్షి ఏ కులమో, ఏ మతమో ఎవరు నిర్ణయిస్తారు. ఒక కిరాతకుడు  తన కడుపు నింపుకోవడానికి వేటాడి  పచ్చి మాంసాన్ని రక్తాన్ని తాగే  హింసాకారుడు  అడవిలో వచ్చే మనుషులను  అడ్డగించి  బెదిరించి వారి వద్ద వున్న ధనాన్ని  వస్తువులను అపహరించే  దారి దోపిడీ  దారు.  అలాంటి వాడికి  ప్రపంచమే ఆశ్చర్యపడే అంత అద్భుతమైన ప్రక్రియ చేయడానికి దోహదపడిన విషయం ఏమిటి  దానికి మూలం ఆలోచించినట్లయితే  నారద మహర్షుల వారు  పేరుకు తగాదాలు పెట్టేవాడు  ఆయన తిరగని ప్రదేశం లేదు  వారికి తెలియని మనస్తత్వాలు లేవు  ఒక పర్యాయం  అడవిలో నుంచి వస్తున్నప్పుడు  కిరాతకుడు ఆపుచేసి  నీ దగ్గర ఉన్న ధనం మొత్తం నాకు ఇవ్వమని బలవంతం చేసినప్పుడు
నాయనా  నా దగ్గర  ఈ తంబురా తప్ప మరి ఏ వస్తువు లేదు. ఈ మహతి వల్ల నీకు ప్రయోజనం లేదు  అసలు నేను అడిగిన దానికి ఒక  సరి అయిన సమాధానం చెప్పు  నీవు  వేట వల్ల  వ్యక్తులను హింసించడం వల్ల  పాపాన్ని మూట కట్టుకుంటున్నావు  ఈ పాపలలో నీ భార్య కూడా భాగం పంచుకుంటుందో లేదో  ఆమెను అడిగి తెలుసుకుని నాకు సమాధానం చెప్పు నీవు వచ్చే అంతవరకు ఇక్కడ నుంచి కదలను అని మాట ఇచ్చి  అతనిని ఇంటికి పంపితే  ఆ ఇల్లాలు  నన్ను ఎవరు వివాహం చేసుకున్నారో వారు నన్ను  మన కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత అతని మీద ఉంటుంది  నీ బాధ్యత నీవు నిర్వహిస్తున్నావ్ నువ్వు ఎలా చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని నేను ఎప్పుడు అడగలేదు  అలాంటప్పుడు దానిలో నేను ఎలా భాగస్వామిని కాగలను  అనగానే జీవితంపై విరక్తి చెంది మహర్షి వద్దకు వచ్చి  విషయం మొత్తం చెప్పిన తర్వాత  రామనామ జపం చేయమంటే రామా శబ్దం పలక లేనివాడు  ప్రక్కన ఉన్న  రావి చెట్టును చూసి దీని పేరేంటి  అంటే  మర అన్నాడు  ఆ మాటనే జపిస్తూ కూర్చోమన్నాడు మహర్షి  మరమరా అన్నదే రామా రామా  శబ్దమై కూర్చున్నది  తనను తాను మరిచాడు.  రామ శబ్దమే మూలం తన చుట్టూ పుట్ట వచ్చినా గమనించని ఏకాంతంలోకి వెళ్లాడు. ఆ పుట్ట నొప్పి వచ్చిన వాడు కనుక  వాల్మీకము నుంచి వచ్చినవాడు వాల్మీకిగా ప్రసిద్ధి చెందాడు  కనుక జన్మించిన కులము కాదు ముఖ్యం  గుణం దానిని లెక్కించాలి అని చెప్తాడు వేమన. ఒక వేటగాడు బోయవాడు  ప్రపంచానికి ధర్మాన్ని బోధించిన వాల్మీకి రామాయణం వ్రాసి ప్రసిద్ధి చెందాడు బ్రమ్మత్వంతో ఆ పద్యాన్ని చదవండి.

"రామ నామ జపముచే మహి  వాల్మీకి 
పాపి బోయదయ్యు బాపడయ్యే  కులము ఘనము కాదు గుణమే ఘనంబు రా..."


కామెంట్‌లు