తత్త్వ జ్ఞానం;-ఏ.బి ఆనంద్, ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ప్రపంచ చరిత్రను మనం గమనించినట్లయితే పరిణామ సిద్ధాంతం ఎంత  సత్యము అర్థమవుతుంది  మానవుడు జన్మించినప్పుడు  కనిపించిన జంతుజాలాన్ని చంపి తినడం  పండ్లను తిని కడుపు నింపుకోవడం  చేస్తున్న రోజులు  ఎలా గడిచాయో మనం విన్నాం. తరువాత ఆకులతో తమ మానాన్ని కాపాడుకుంటూ  ఆత్మ రక్షణ కోసం చిన్న చిన్న ఆయుధాలను తయారు చేసుకోవడం  ఆ తర్వాత  ప్రకృతి మనకు ప్రసాదించిన భూమి ఉండగా  దానిని దున్ని సేద్యం చేసినట్లయితే  జీవితం ప్రశాంతంగా ఉంటుంది కదా అన్న ఆలోచన వచ్చి  అలా చేయడం వల్ల నేడు ప్రతి వ్యక్తి  సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యపరంగా జీవించడానికి అలవాటు పడ్డాడు  బుద్ధి  నిశ్చలంగా ఉన్నా మనసు మాత్రం పరి పరి విధాల ఆలోచిస్తూ ఉంటుంది. మనం ఈ ప్రపంచంలో ఎలా పుట్టావు భగవంతుడు పుట్టించాడా  లేక మానవుడా  అన్న సందేహంతో ప్రారంభమై  శంకరాచార్యుల వారు వచ్చిన శుభ ముహూర్తంలో  నీవు వేరు దైవం వేరు కాదు  నీవే దైవంఅహం బ్రహ్మాస్మి అని వేదం చెప్పింది కనుక దానిని అనుసరించడం మానవ ధర్మం  అన్న సిద్ధాంతాన్ని ప్రచారం చేసి  అద్వైతిగా నిలబడిపోయాడు  ఆ తర్వాత రామానుజాచార్యులు గారు వచ్చి దానిని వ్యాఖ్యానిస్తూ  అద్వైతమే కానీ ఇది విశిష్టమైనది అంటూ  ప్రత్యేక నిర్వచనాన్ని ఇచ్చారు  ఆ తర్వాత మధ్వాచార్యులు గారు వచ్చి  వారు చెప్పినా వీరు చెప్పినా వినండి తప్పులేదు కానీ మీరు ఉన్నారు అన్నది సత్యం కదా  మీరు నమ్ముతున్నది భగవంతుని కదా కనుక  మనసులో ద్వైతాన్ని రూపుదిద్దుకోండి అని చెప్పడంలో ఈ ప్రపంచంలో మూడు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.
మనసులో అద్వైత సిద్ధాంతం నాటుకుపోయి బయట  ద్వైత సిద్ధాంతాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే అసలు తత్వం అంటే ఏమిటి అని ఆలోచన మనిషికి వస్తుంది కదా  తత్వమసి ఏది శాశ్వతంగా ఈ ప్రపంచంలో నిలిచి ఉన్నదో  అది నీవే అన్న  స్పష్టమైన సంకేతం వచ్చిన తరువాత శంకరాచార్యుల వారు చెప్పిన అద్వైతం  అనుసరించవలసినది అని తెలుస్తుంది  ఎప్పుడైతే వ్యక్తిగతంగా తాను ఆ సుఖాన్ని తత్వపు బోధను అర్థం చేసుకున్నాడో దానిని అనుసరిస్తూ ఉండడం సహజం కదా  అంటాడు వేమన  వేమన పద్యాల ద్వారా నిజానికి ఆయన నాస్తికుడో ఆస్తికుడో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. వారి రచనల వల్ల ఊహాగానాలు తప్ప అసలు విషయం వారి మనసు ఎవరికీ తెలియదు అన్నది  పెద్దలు చెప్పిన మాట  ఆ పద్యాన్ని ఒకసారి చదవండి

"అంతరంగమందు నద్వైతమేయుండు బాహ్యమందు ద్వైతభావముండు ఎట్లుకాక తత్త్వ మలవడబోదు..."


కామెంట్‌లు