జయ హనుమాన్!శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098
👌"జయ హనుమాన్" మంత్రము!

జయము నొసఁగు మంత్రము!

     భక్త మహాశయులకు!

ఆత్మ బంధువు లార!
     (ఆత్మ బంధు పదాలు., శంకరప్రియ.,)

👌"జయ హనుమాన్".. అయిదు అక్షరములు కలది! "పంచాక్షర" మంత్రము! ఆరాధకులకు, మరియు సాధకులకు... విజయములు, శుభములు నొసంగు దివ్య మంత్రము!

👌ఆంజనేయుడే హనుమంతుడు! అంజనీ దేవి సుపుత్రుడు! వాయుదేవుని కుమారుడు! దివ్యజ్ఞానమునకు, సద్గుణములకు మహా సముద్రము వంటివాడు! సాటిలేని బల పరాక్రమములు కలవాడు! ముల్లోకములను ప్రకాశింప జేయువాడు! 

👌ధర్మ స్వరూపుడైన రామచంద్రుని సేవకుడు! మహావీరుడు! వజ్రము వంటి దివ్యదేహము కలవాడు! విక్రమ స్వరూపుడు! దుర్బుద్ధిని పోగొట్టు వాడు! సన్మార్గులకు మేలు చేయువాడు!

🙏జయ హనుమాన! జ్ఞాన గుణసాగర!
     జయ కపీశ! తిహు లోక ఉజాగర!(1)
       రామదూత! అతులిత బలధామా!
       అంజని పుత్ర! పవనసుత నామా! (2)
      మహావీర! విక్రమ! బజరంగీ!
      కుమతి నివార! సుమతి కే సంగి!(3)
        (గోస్వామి తులసీదాసు., శ్రీహనుమాన్ చాలీసా.,)

🚩తేట గీతి పద్యములు

🙏జయము! హనుమంత! కపివీర! జయము జయము!   
   సద్గుణంబుల సాగరా! సమర విజయ!
      మూడులోకాల ప్రభలకు మూలమీవె!
      భవ్య గుణధామ! శ్రీరామభక్త హనుమ!
            
🙏వజ్ర సన్నిభ! విక్రమ! వాయుపుత్ర!
     సద్గుణంబులు గల్గింప సన్నుతింతు!
     మంచిఁ బెంచుము మహియందు మాన్య చరిత!
       భవ్య గుణధామ! శ్రీరామభక్త హనుమ!(2)
         
( "శ్రీహనుమాన్ ప్రపత్తి" శ్రీహనుమాన్ చాలీసా భావానువాదము: "భక్త కవిరత్న"
 భమిడిపాటి కాళిదాసు., )

కామెంట్‌లు
చక్కని విరణ. హనుమ శంకరాంశ కదా!
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం