దినమణి.. ప్రభాకరుడు శంకరప్రియ., శీల.,సంచారవాణి: 99127 67098

 👌నవ్య దివ్య ప్రభలు
      కలిగించు చున్నాడు!
      దినమణి ప్రభాకరుడు!
               ఓ తెలుగు బాల!
          ( తెలుగుబాల పదాలు., శంకరప్రియ.,)
👌ఆరోగ్య ప్రదాత.. ప్రత్యక్ష దైవము.. ప్రభాకరుడు! దైనందిన వ్యాపారముల యందు ప్రేరేపించు వాడు! కనుక, "సూర్యుడు" అని, పేరు! సంచరించు వాడు! కనుక, "సూరుడు" అని, పేరు! ప్రశస్తమైన కాంతిని కలిగించు వాడు! కనుక, "ప్రభాకరుడు"! వేయి కిరణములు కలవాడు! కనుక, "సహస్రాంశువు".. ఆదిత్యుడు!
👌పగలుకు రత్నము వంటివాడు! కనుక, "దిన మణి" అని, పేరు! విశేషముగా ప్రకాశించువాడు! కనుక, "ప్రద్యోతనుడు" అని, పేరు!
       "ప్రద్యోతనో దిన మణి" అని, అమరకోశం నిర్వచించినది!
        🚩 తేట గీతి పద్యం 
 🙏వేయి కిరణాల వెదజల్లి వెలుగు వాడు
    పిలిచినా వేయి నామాల పలుకువాడు
    చక్రమొక్కటి యైనను సాగు వాడు
    ఊరువులు లేని సారథి యున్న వాడు
🙏ఏడు గుర్రాల నురికించు నెలమి రేడు
    కాల మేదైన కనిపించు "కమల జోడు"
    కరము లెత్తిన చాలును కనిక రించి
    ఆయు రారోగ్యముల నిచ్చు నయ్య నితడు!     
      ( రచన: నన్నపురాజు  రమేశ్వర రాజు., )
కామెంట్‌లు