* అన్ని రూపముల........! *; - కోరాడ నరసింహా రావు

 పల్లవి :-
  అన్ని రూపముల కతీతమైన 
ఆది శక్తివి నీవమ్మ.... !
 వివిధ ప్రాంతముల, వివిధ నా మముల....అలరారు చున్నా 
వమ్మా....!!
          " అన్ని రూపముల... "
చరణం :-
    ముగురమ్మలుగా...వెలసీ 
జగములు పాలించేవమ్మా... ! 
 ఎల్ల వేళ లా కరుణతో మము 
    చల్లగ చూడమ్మా... !! 
 దుష్టుల పాలిట కాల రాత్రివి 
శిష్టుల కావగ శాంత స్వరూపివి 
         " అన్ని రూపముల... "
చరణం :-
     అష్టాదశ శక్తి పీఠముల కధి 
 దేవాతవమ్మా.... !
   గ్రామ, గ్రామమున గ్రామ దేవ తగ వెలసినావు తల్లి... !!
ఛండివి, చాముండివి... బాలా త్రిపుర సుందరివి, లలితవు నీ వమ్మా.... !
   ఎవరే పేరున పిలిచి, కొలిచిన 
పలికే తల్లివి నీవమ్మ,  
 వరములనొసగే దయాసాగరివి
 జగజ్జనని మము చల్లగ చూడమ్మా.... !!
   మము చల్లగ చూడమ్మా.... 
       *****
కామెంట్‌లు