సుప్రభాత కవిత ; -బృంద
నీలాల నింగిని 
రంగుల్లో ముంచేసే
ఆకాశదీపం ప్రభవించే
అపురూప సమయాన

నీటిని తాకిన కిరణాల
వెలుగులో పసిడి సిగ్గుల
మొగ్గలా విరిసింది సరస్సు
మురిసింది మనసు

కలతలన్నీ మరచి హాయిగా
గగనానికెగిరింది 
స్వేచ్ఛావిహంగమై 
ఆనందపు అంచులు తాకగా..

మనసు పాడే మౌనగీతి
ఆలించి అబ్బురంగా 
నిలిచి చూసేను
నీలి మేఘమాలలు

మబ్బుల వెంట పరుగులు
ఉరకలు  వేసే ఊహలు
కన్నుల నిండెను కలలు
ఆగక  ఆడే రెక్కలు

కష్టమైనా సుఖమైనా
వేదనలూ వెక్కిరింపులూ...
మనసు పొందే  సంతోషం 
ముందు చిన్నవే!

మదినెరిగి  మసలుకుంటూ
చిన్ని చిన్ని ఆనందాలు
ఎంచి ఎంచి పోగుచేసి
మనసు నింపుకోవాలి.

కొత్త ఉత్సాహం  తెచ్చే
కొంగొత్త వేకువను
నిండు మనసుతో స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు