ఆయన పేరు మనందరికీ తెలీదు.అసలు సిసలు భారతీయుడు! కానీ పోలాండ్ వాసుల గుండెల్లో నిల్చిన దేవుడు!ఆయనే మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింహ్!1933-1984దాకా నవానగర్ రాజాగా వెలిగాడు.ప్రసిద్ధ క్రికెట్ ఆటగాడు రణజీత్ సింహ్ సోదరుని కొడుకు ఈయన!లండన్ లో చదువు ముగించి భారత్ కి తిరిగివచ్చి బ్రిటిష్ సైన్యంలో చేరాడు.బాబాయి చనిపోయాక నవానగర్ సింహాసనం ని అధిష్ఠించారు.భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు ఎన్నో క్రీడల క్లబ్బులలోమెంబర్!భారత్ సిలోన్ క్రికెట్ మ్యాచ్ లో1933-34 ఆడారు.
రెండో ప్రపంచయుద్ధపు రోజులవి.హిట్లర్ పోలెండ్ పై దాడి చేసి భీభత్సం సృష్టిస్తున్న రోజులు అవి.సైనికులు తమ భార్య పిల్లలని ఓడలో పంపేశారు దైవంపై భారంవేసి.ఆఓడ గుజరాత్ లో ని జామ్ నగర్ ని సమీపించింది.దిగ్విజయ్ వారికి ఆశ్రయం కలిగించి అండగా నిలిచారు. 600పైగా ఉన్న పోలెండ్ స్త్రీలు పిల్లలని 9ఏళ్ళపాటు పోషించారు. ఆపిల్లల చదువుకి చేయూత నందించారు.ఓపిల్లాడు ఆతర్వాత పోలెండ్ ప్రధానమంత్రి కావటం ఓవిశేషం! పోలెండ్ రష్యా నుంచి విడిపోయాక ఆప్రజలు తమ భక్తి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆరాజు పేరుతో ఓ కూడలికి ఆయన పేరు పెట్టి విగ్రహం నెలకొల్పారు.ఇప్పటికీ పోలెండ్ వాసులు ప్రతిఏడాది మనదేశంలో బాలాచడీ అనే ఆప్రాంతాన్ని దర్శించి పుణ్య క్షేత్రంగా భావిస్తున్నారు. దిగ్విజయ్ దొడ్డబుద్ధిని తల్చుకుంటూ నివాళులు అర్పిస్తారు.పోలెండ్ రాజధాని వార్సాలో ఎన్నో రహదారులు ఆయన పేరుతో పిలవబడుతున్నాయి.ప్రతి ఏడాది అక్కడి పేపర్లలో మహారాజు జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింహ్ ని గూర్చి వార్తలు కథనాలు వస్తాయి. 🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి