బ్రతుకంటే @ కోరాడ నరసింహా రావు !
 ఒకడు... నిన్నటి తప్పొప్పుల తర్క వితర్కంలో నే మునిగి ఉన్నాడు... !
  ఇంకొకడు...రేపటి...
              ఊహాలోకాల్లో.... 
     తేలిపోతున్నాడు... !
వీడికి మాత్రం.... 
   నిన్నటి తలపు లేదు... !
     రేపటి ఆలోచనా రాదు... !!
 కానీ.... !
   ఒకడున్నాడు.... 
      నిన్నటి అనుభవాలే... 
        పునాదిగా...., 
   రేపటి ఆశలసౌధాన్ని... 
      ఈరోజే, నిర్మించటం... 
      మొదలుపెట్టాడు... !
   
వీడిదే కదూ... బ్రతుకంటే... !
  బ్రతకటమంటే.... 
    ఇలాగే కదూ బ్రతకాలి  !!
      ******

కామెంట్‌లు