పర్యావరణ కాలుష్యం;-- సి.హెచ్.ప్రతాప్
 పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది.  ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక మరియు సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి.  ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి మరియు వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి అది సహాయపడుతుంది.
ఆధునిక పట్టణీకరణ ప్రపంచీకరణ పారిశ్రామికీకరణ మరియు ఆధునిక  సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో ఆర్థికాభివృద్ధి పేరుతో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు తద్వారా పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగిస్తున్నాయి.
పర్యావరణ కాలుష్యం ఎక్కువై ప్రపంచ మానవాళి పలు అనారోగ్య సమస్యల వలయంలో చిక్కుకొవటమే  కాకుండా మార్కెట్లో మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలనుఇబ్బడి ముబ్బడిగా  పడేయడం వల్ల సిరులు పండే నేల  మరియు జీవాధారమైన నీరు  కాలుష్యమౌతుంది. వాహనాలు, పరిశ్రమలు వదిలే పొగ గాలి కాలుష్యాన్ని  తద్వారా ఉత్పన్నమయ్యే వేడి సమీప ప్రాంతాల జలాశయాల ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యఒ జరుగుతోంది. ఈ విధంగా మానవడి  అనేక కార్యకలాపాల వల్ల కార్బన్ ఉద్గారం ఎక్కువ కావడంతో వాయు కాలుష్యం ఏర్పడి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.
వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు మరియు వివిధ రకాల మెదడు, గుండె సమస్యలు పెరుగుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం, మెదడులో రక్తం గడ్డ కట్టడం,  కంటి చూపు మందగించడం లాంటిరుగ్మతలు ఎక్కువ అవుతున్నాయని అనేక ఆరోగ్య సర్వేలు వెల్లడించాయి.  నేడు మనం నిత్యం వాడే  పాలు పండ్లు కూరగాయలు కలుషితమౌతున్నాయి.  కాలుష్యం ఫలితంగా  ప్రపంచంలో మానవ  జాతి నయం చేయలేని భయంకర రోగాలబారిన  పడి వైద్య ఆరోగ్య రంగానికి సవాల్  గా పరిణమించడం శోచనీయం.  
ప్రజల సహకారం లేకపోయినట్లైతె ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా ప్రయోజనం అనుకున్నంత ఉండదు. పర్యావరణ సమతుల్యతను సంరక్షించుటకు ప్రజల  సామాజిక బాధ్యత. నిరంతర ప్రజా చైతన్యం పర్యావరణ పరిరక్షణలో కాలుష్య రహిత సమాజం అభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, యువజన మహిళా సంఘాలు, పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణా చట్టాల పై అవగాహన శిబిరాలు చర్చలు నిరంతరం నిర్వహించాలి. మీడియా, ప్రసార సాధనాలు, ప్రకృతి రక్షణ కాలుష్య నియంత్రణ విధానాల పట్ల ప్రజలను చైతన్య పరిచేందుకు తోడ్పడాలి.అడవులను సంరక్షించటం ద్వారా చెట్లు పెరిగి ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలను పునర్వినియోగపరిస్తే చాలా కాలుష్యం తగ్గుతుంది. స్కూళ్ళలో, కాలేజీలలో విద్యారులకు వాతావరణ కాలుష్యం గురించి అవగాహన కల్పించాలి. తద్వారా వాతావరణ కాలుష్య చట్టాలను అమలు పరచేలా చూడవచ్చు. ఓజోన్ పొరను సంరక్షించి అనేక వ్యాధులను నివారించే బాధ్యత కూడా మనందరిపై ఉన్నది.

కామెంట్‌లు