అల్పారంభః క్షేమకరః-ఏ పనైనా మొదటనే పెద్ద ఆర్భాటంతో కాకుండా, చిన్నగా ప్రారంభించడమే మేలు.
2. గుణాః పూజాస్థానం గుణిషు, నచ లింగం నచ వయః-గుణాలను బట్టి పూజించాలి తప్ప, వ్యక్తి వయసు కానీ, పురుషుడా, స్త్రీయా అనే భేదం కానీ గౌరవించడానికి తగవు.
3. శరీర మా ధ్యంఖలు ధర్మసాధనం-శారీరకమైన ఆరోగ్యం ధర్మసాధనకు మూలం. శరీరం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటేనే ఏ ధర్మకార్యాలైన చేయగలుగుతాం.
4. ధైర్యేచ సాహసే లక్ష్మీః.-ధైర్యం లో, సాహసంలో లక్ష్మి నివసిస్తుంది. అంటే ధైర్య సాహసాలు ఉంటేనే సంపదలు చేకూర్తాయని భావం.
5. పరోపకారార్ధ మిదం శరీరం-ఈ శరీరం పరులకు ఉపకారం చేయడం కొరకే వినియోగించాలి.
6. గురునిందా అధోగతిః-గురువుల్ని నిందించడం పతనానికి కారణం.
సంస్కృత సూక్తులు.;-తాటి కోల పద్మావతి గుంటూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి