సంపన్న బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన మురళీధర్ దేవదాస్ ఆమ్టే కుష్టురోగులపాలిటి దైవం!26డిసెంబర్ 1914లో హింగన్ ఘాట్ (మహారాష్ట్ర) లో పుట్టారు.తండ్రి రెవిన్యూ ఆఫీసర్. ఖరీదైన కారులో తిరిగే బాబా సినీపత్రికకు సమీక్షలు రాసేవారు. సినిమాకి మూడు టికెట్లు కొని ముందు రెండు సీట్లపై దర్జాగా రెండు కాళ్ళు పెట్టుకుని చూసేవారు. డాక్టర్ కావాలని అనుకున్న ఆయన తండ్రి బలవంతంపై లా చదివారు. హాలీవుడ్ తారలకి లేఖలురాసి వారి ఉత్తరాలు అందుకుని పొంగిపోయిన ఆయువకుడుబ్రిడ్జ్ టెన్నిస్ ఆటలలో పేరు పొందారు. ఆరుగురు కూతుళ్లు ఉన్న ఓతండ్రి చనిపోతే ఓఅమ్మాయిని పెళ్లాడి సాధన అని పేరు మార్చారు.450ఎకరాల కుటుంబంకి చెందిన ఆయన ఓరోజు వర్షంలో రోడ్డు పక్కన వేళ్ళు లేని చీమలు పాకుతున్న కుష్టు రోగిని చూసి సేవారంగంలో అడుగు పెట్టారు.తులసీరాం అనే ఆవ్యక్తి కి సేవచేయటం కొంత కాలానికే అతను చనిపోటం బాబాలో తుఫాను రేపింది.1949లో కలకత్తా స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ లోచేరి కుష్టు వ్యాధిపై పూర్తి అవగాహన కలిగాక 60గ్రామాల్లో వైద్యం చేస్తూ 11ఆసుపత్రులతో విశ్రాంతి లేని జీవితం లో తృప్తి పొందిన ధన్యజీవి.బీడు భూమిని సస్యశ్యామలంగా మార్చి జొన్న రాగి కూరగాయలు పండిస్తే జనం అవి కొంటానికి జంకేవారు.తమ ఆవాసాలకు ఆయన పెట్టిన పేరు ఆనందవన్! ఆదివాసీల అభ్యున్నతి కై కంకణం కట్టుకున్నారాయన.వెన్నెముకకి సర్జరీ జరిగినా కొడుకు ప్రకాష్ కోడలి సహకారంతో ఆదివాసుల గోండుల అభ్యున్నతికై తన జీవితం ధారపోశారు.భారీ ఆనకట్టల నిర్మాణం కి పూర్తి వ్యతిరేకి. అంధ మూగ చెవిటి అనాధలకోసం బడులు శరణాలయాలు కట్టించారు.ఇక జాతీయ అంతర్జాతీయ పురస్కారాలకు అంతేలేదు.ఓవిశేషం ఏమంటే పద్మవీభూషణ్ పొందిన ఈయనకు రామన్ మెగసెసే అవార్డువచ్చింది.ఆయన కొడుకులు కూడా ఆయన అడుగు జాడల్లో నడవటం విశేషం.9ఫిబ్రవరి 2008లో అమరులైన బాబా ఆమ్టే చిరస్మరణీయులు🌷
బాబా ఆమ్టే!అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి