దేశం లో ప్రమాదం అంచున పర్యావరణం;- సి.హెచ్.ప్రతాప్
 పర్యావరణ పరిరక్షణలో భారత దేశం అగ్రగామిగా వుందని, పారిస్ ఒప్పందం ద్వారా నిర్దేశిత లక్ష్యాలను రెండు సంవత్సరాల ముందుగానే పూర్తి చేసాఅని ఇటీవల పార్లమెంట్ సాక్షిగా కేంద్ర పర్యావరణ మంత్రి ఘనంగా ప్రకటించారు. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రకటనలన్నీ ఆర్భాటపు ప్రకటనలేనని అమెరికాకు చెందిన యాలే సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ లా అండ్ పాలసీ, సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ మరియు కొలంబియా వర్సిటీలు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయన నివేదికలో తేలింది. ప్రపంచంలో మొత్తం 180 దేశాలలోని స్థితిగతులను పరిశీలించి , పర్యావరణ పరిరక్షణ, ప్రజలకు ఆరోగ్య పరిరక్షణ ఇత్యాది 33 అంశాలను అధ్యయనం చేసి రూపొందించిన ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో భారత దెశం అత్యంత తక్కువ స్కోరు సాధించి అట్టడుగున 180 వ స్థానంలో నిలబడదం ద్రిగ్భాంతికరం. ఈ నివేదిక ప్రకారం దేశంలో పర్యావరణం ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోందని, పర్యావరణం,వాయు, జల కాలుష్యం, భూగర్భ జల నాణ్యత,భూమి సారం క్షీణత తదితర విషయాల పట్ల ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అరకొరగా వున్నాయని అర్ధమౌతొంది.పర్యావరణ వ్యవస్థ, జీవశక్తి ,బయోడైవర్సిటీ, ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థ సేవలు అంటే 11 క్యాటగిరీలు మన దేశం అత్యల్ప స్కోరు సాధించడం క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పరిరక్షణ చర్యల వైపల్యాన్ని స్పష్టం చేస్తోంది. 1998-2018 మధ్యలో పరిశీలిస్తే భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయారు. 2018 నాటి వాయు కాలుష్యమే ఇప్పుడు కూడా కొనసాగితే రాబోయే కాలంలో సగటు భారతీయుని జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుందని హెచ్చరికలు చేసినా కూడా ప్రభుత్వాలు ఈ విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పవచ్చు. దీని వలన దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ప్రస్తుత వాయు కాలుష్యం ఇలాగే కొనసాగితే ఇక్కడి వాసులు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారని పర్యావరణవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. దక్షిణ భారతంలో చూస్తే తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ ఉన్నాయి. గాలి కలుషితమై పసిపిల్లల ఉసురు తీస్తున్న దేశాల విషయంలో కూడా భారత్‌ లోనే అత్యధికం. 2019లో 1,16,000 మంది చిన్నారులు భూమ్మీదకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రాణాలు కోల్పోయారు  భారత్‌లో వాయు కాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ మాత్రం లేదని నివేదిక తెలిపింది. భారతదేశంలో కాలుష్యం డబ్ల్యుహెచ్‌ఒ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉందని...ఇదే పరిస్థితి కొనసాగితే...రాబోయే కాలంలో మరింత ప్రమాదం ముంచుకు వస్తుందనడంలో సందేహం లేదు.
కాగా మన పొరుగు దేశాలైన మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ వంటి దేశాలు మన కంటె ముందు వరసలో వుండడం ఆశ్చర్యకరం.  ప్రభుత్వ చర్యలు క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలనిచ్చేందుకు ఉన్నతాధికారులతో ఉపసంఘాల ఏర్పాటు, శిలాజ ఇంధనాలకు బదులు ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం,అన్ని పరిశ్రమలలో పర్యావరణ నిబంధన అమలును ముదింపు చేసేందుకు ఎన్విరాన్ మెంటల్ సీనియర్ అధికారులతో ఆడిట్ల నిర్వహించి, నిబంధనలు అతిక్రమించే సంస్థలకు లైసెన్సులు రద్దు చేయడం, పర్యావరణ పరిరక్షణ కోసం వార్షిక బడ్జెట్ లో ఎక్కువ నిధుల కేటాయింపు వంటి చర్యలు చిత్తశుద్ధితో అమలు కావాలి.. కార్బన్ శూన్యత

సాధించేందుకు 2070 వ సంవత్సరాన్ని మన ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అయితే మన కంటె చిన్న, వెనుకబడిన దేశాలు సైతం 2050 కల్లా ఈ లక్ష్యం సాధించేందుకు పక్కా ప్రణాళికలు వెసుకున్న సందర్భంలో భారత్ కూడా తన లక్ష్యాన్ని పున: సమీక్ష చేసుకోవాల్సిన అవసరం వుంది.  
కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం