సంస్కృత న్యాయాలు.;-తాటి కోల పద్మావతి గుంటూరు

 1. అలంకృత శిరచ్చేద న్యాయం-ఒడలంతా అలంకరించి తలను తెగవేయడం. (ఒక వ్యక్తికి ఉన్నతమైన పదవిని ఇచ్చి, తరువాత ఆ ఉద్యోగం నుండి తొలగించడం లాంటి సందర్భాల్లో వాడవచ్చు).
2 కాక పికన్యాయం-కోయిల కాకులతో సహవాసం చేసిన వసంతకాలం వచ్చాక, తన తీయని గొంతును వినిపిస్తుంది. సుజన దుర్జనుల స్వభావం సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది అనడానికి సూచిక ఇది.
3. నీచా శ్రేయో న కర్త వ్యః-కర్తవ్యో మహాదా శ్రయః.-ఏ పనికైనా నీచుల్ని ఆశ్రయించరాదు. గొప్ప వాళ్ళనే ఆశ్రయించాలి.
4 ఉద్ధరే దాత్మ నాత్మనమ్-. తనను తానే ఉద్ధరించుకోవాలి.
5. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం-శ్రద్ధ గల వాడే జ్ఞానాన్ని పొందుతాడు.
6. అశాంతస్య కుత సుఖం-శాంతం లేని వానికి సౌఖ్యం లేదు.
6. న హి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గ తిం తాత! గచ్చతి.
నాయనా ! మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ చెడడు. (సంస్కృతంలో'తాత'అంటే'తండ్రి'అని అర్థం. తాత అంటే కులాన్ని విస్తరింప చేసేవాడని వ్యుత్పత్తి.
7. ఆలస్యం హి మను షాణాం శరీరస్తో మహాన్ రిపుః!
సోమరితనం మానవులకు వాళ్ళ దేహంలో దాగి ఉండే గొప్ప శత్రువు.

కామెంట్‌లు