మితిమీరింది దురాగతం
. నశించింది సహనం
ఉప్పొంగింది ఆక్రోశం
పెల్లుబికింది పౌరుషం
భారతీయుల
న్యాయ పోరాటాలు
ఆయుధ చర్యతో
అణచివేతలు.....
మరిగిన యువరక్తం...
చేసింది ప్రాణత్యాగం
వందే మాతర నినాదం...
మారుమ్రోగింది దేశం !
జైహింద్ నినాదంతో....
మొదలయ్యింది...
మరో వాదం.... !
అడుక్కుంటే వచ్చేది...
కాదు స్వాతంత్య్రం
సాయుధ పోరాటమే...
శరణ్యం..... !
అని తలచింది....
సుభాష్ హృదయం !
సాగింది సమీకరణం.....
సమకూరింది సైన్యం !
మొదలయ్యింది...
ఆజాద్ హింద్ ఫావుజ్
సమరం..... !
గెరిల్లా యుద్ధ విధానం
ఆంగ్లేయుల గుండెల్లో...
భయం - భయం... !
దేశం మరువదు...
నీ వీరత్వం.... !
యువతకయింది...
స్ఫూర్తిదాయకం.... !!
నీ మరణం....
ఒక మిష్టరీ..... !
రక రకాల కథనాల...
హిస్టరీ...... !!
జయహో జయ జయహో సుభాష్... అమర్ రహో.... !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి