సంస్కృతంలో ప్రహేళికలు. (పొడుపు కథలు).;- తాటి కోల పద్మావతి గుంటూరు

 1. క్రీడా గోష్టి వినోదేషు, తజ్నై రా కీర్ణ మంత్రణే,
పరవ్యా మోహనే చాపి, శోపయోగాః ప్రహేళికాః.(కావ్య దర్శం-దండి).
ప్రయోజన దృష్టితో-సాహిత్య క్రీడగానూ, సభలలో ఆనందాన్ని పంచడానికి, అందరూ ఉన్నప్పుడు తమ వారికి సంకేతాన్ని ఇవ్వడానికీ, ఇతరులకు తెలియకుండా ఉండడానికి, గుప్తంగా ఏర్పరచుకునే మాటలా పోహళింపే ప్రహేళిక పొడుపు కథ.
జిజ్ఞాస ప్రహేళిక .
వృక్షాగ్ర వాసీ నచ పక్షిరాజః, త్రినేత్ర థారీ న చ శూలపాణిః.
త్వగస్త్రధారి నచ సిద్ధయోగీ, జలం చ బి బ్రత్ నఘటో నామేషః"
చెట్టు పైన నివసిస్తుంది కానీ పక్షి కాదు. మూడు కళ్ళు ఉంటాయి కానీ శివుడు కాదు. చర్మాన్నే వస్త్రంగా కలిగి ఉంటుంది కానీ సిద్ధ యోగి కాదు. జలాన్ని ధరిస్తుంది కానీ కడప కాదూ, మేఘము కాదు. మరేది?
సమాధానం: కొబ్బరికాయ.
3. సంశయ ప్రహేళిక.
వుచ్చిస్టం శివ నిర్మాల్యం, వమనం శివ కర్పటం'
కాక విస్టా సముత్పన్నః, పంచైతే, తి పవిత్ర కాః"
ఎంగిలి, 2 శివనిర్మాల్యం, 3 వాంతి, 4 శవం మీద కప్పిన గుడ్డ, 5 కాకి రెట్ట నుండి పుట్టిందీ-ఈ ఐదు చాలా పవిత్రమైనవి. బయటికి ఇవి అపవిత్రంగా కనిపిస్తున్న ఈ పదాలకు వేరే అర్థాలను పండితులు చెబుతారు.
ఉ చ్చిస్టం అంటే ఆవు పాలు (దూడ తాగినవి) శివ శివ నిర్మాల్యం"శివ భగవానుని జడల నుంచి ప్రవహించే గంగ, వమనం అంటే తేనెటీగలు గ్రోలిన తేనె, శివ కర్పటమ్ అంటే పట్టుపురుగు శరీరంతో తయారయ్యే పీతాంబరం, కాక విష్టా సముత్పన్నః అంటే హవిసు. ఈ ఐదు అంటే పాలు , గంగ, తేనె, పట్టు వస్త్రం హవిసు) పవిత్రమైనవి అని అర్థం.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం