చింత చెట్టు కింద చిన్నయ్యా! ;-గంగదేవు యాదయ్య

 చింత చెట్టు కింద చిన్నయ్యా ! 
ఇది నీది కాదయ్యా !? 
వేపచెట్టు కింద వేణయ్యా ! 
ఇది నీది కాదయ్యా ! ? 
తాటి చెట్టు కింద తాతయ్యా! 
ఇది నీది కాదయ్యా ! ?
మామిడి చెట్టు కింద మామయ్యా!
ఇది నీది కాదయ్యా ! ? 
మర్రి చెట్టు కింద మారయ్యా! 
ఇది నీది కాదయ్యా ! ?
రాగి చెట్టు కింద రామయ్యా!
ఇది నీది కాదయ్యా ! ?
ఈత చెట్టు కింద వీరయ్యా! 
ఇది నీది కాదయ్యా ! ?
జామ చెట్టు కింద జానయ్యా! 
ఇది నీది కాదయ్యా ! ?
పనస చెట్టు కింద పాపయ్యా 
ఇది నీది కాదయ్యా ! ?
ఇర్కి చెట్టు కింద ఇరమరాజూ 
నువ్వెట్ల అయితవ్ దరమ రాజూ....!?
కుర్రో - కుర్రు
( ఉయ్యాల - జంపాల : పిల్లల పాటలూ, పద్యాల రచయిత)
కామెంట్‌లు