శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 పూర్వం గురువు దగ్గర విద్య పూర్తి అయిన తరువాత గృహ స్థ ధర్మం నిర్వహించటానికి అనుమతి ఇవ్వబడింది.అందుకే ఏకాగ్రత తో చదివి మంచి బుద్ధి కలిగి ఉండేవారు.ఆకార్యక్రమంని స్నాతక్ అనేవారు.కానీ నేడు డిగ్రీ పొందిన విద్యార్ధిని అంటున్నారు.
స్థవిర్ అంటే కర్రపట్టుకునడిచే వృద్ధుడు.బౌద్ధభిక్షువులలో ఒక సంప్రదాయం . మరాఠీలో థెరడా అనేది తిట్టు పదం.
స్థోమత అంటే సంస్కృతంలో రాశులసముదాయం.బాగాడబ్బు ధనధాన్యాలున్న వ్యక్తి అని.మనంస్థోమత ఉన్న వారు అంటాం.మరాఠీలో అభిమానం అని అర్థం.
సోలార్ అంటే ఇంట్లో పిల్లలు పుడితే పాండే మంగళగీతాలు.సంస్కృతంలోని సూతికాగృహం ప్రాకృతం లో సుయిహర్ ఐంది.బెనారస్ పరిసర ప్రాంతాల్లో సోలార్ తెగవారు ఉన్నారు.సోహారీ అంటే సుందర మైన ఆహారం.

కామెంట్‌లు