సముద్రం అన్నా సంద్రమన్నా ఒక్కటే,సముద్రం నిండుదనం గొప్పతనం ఎవరికి తెలుసు?
నర్మగర్భం నగ్నసత్యం !!
కడుపులో దాచుకొని కొండంత అదృష్టం,అందులోనే నింపుకొను అందుకోలేని కష్టం,అందని లోతుల్లో పొందిన అదృష్టం మనకి కొలత లేదు,ఎల్లలు లేవు,కొండంత ఆనందం!
కోపమొచ్చెనా ఇంచుకైన ఆలోచించదు దారి తప్పదు వారా వీరా అని చూడదు,అందరూ ఒక్కటే సమానత్వం నాది అంటుంది,నా అంచున మీరంతా నన్ను జూచి నేర్చుకోండి!!
ఎవరేమన్నా మనిషి జీవితం మహాసముద్రమే సాధ్యమైనంత వరకు ఎల్లలు దాటదు
మనిషి ప్రతి కష్టానికి పరుగులే !!
గుంభన లేక గగ్గోలు పడి పరుగులెత్తు!!
అంతెందుకు అమ్మ మనసు సంద్రం కాదా జీవితాంతం అందరి బాగోగులే అమ్మ మనసుకోరు,
నిధినిక్షేపాలు ప్రేమాభిమానాలు
అందరికీ పంచు సరి సమానంగా!!!
కోరదేమి కోరికలు అందరి బాగు తప్ప అందుకే ప్రతి జీవి సముద్రాన్ని చూచి నేర్చుకోవాలి,
నేర్చుకోవాల్సింది ఎంత ఉందో,కానీ ఈ జీవితం చాలదు !!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి