వేమన మహాయోగి జీవితాన్ని ఆద్యంతం అనుభవించిన వాడు. భోగి అయినవాడు మాత్రమే యోగి అవుతాడు అన్నది అక్షరాల నిజం అని నిరూపించిన మహానుభావుడు. ఎప్పుడో ఏడవ శతాబ్దంలో వ్రాసిన ఆయన ప్రతి పద్యం ప్రతి ఒక్కరి నాలుక పైన ఉంటుంది. పచ్చి నిజాలను మానవులు ఆచరించవలసిన రీతిని తెలియజేసిన సామాజికవేత్త ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు ఏ కులంలో పుట్టారు అన్న వివరాలు ఎవరికీ తెలియవు ఎవరికి వారు తప్ప రెడ్డి అనే చెపుతారు. కానీ ఆయన పద్యాలలో అన్ని కులాలను మతాలను నిరసించిన వాడు జంగం కులాన్ని మాత్రం విమర్శించలేదు కనుక ఆయన జంగమ అయి ఉండవచ్చు అని మరికొందరు చెబుతూ ఉంటారు ఏది ఏమైనా కారణజన్ముడైన వేమన జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఆది కవి వాల్మీకి మహర్షి ప్రపంచానికి న్యాయాన్ని తెలిపిన వ్యాసమహర్షి లాగా వేమన ప్రతి ఒక్కరి మనసులను దోచుకున్న ప్రజాకవి వేమన అంటేనే వేమః అంటే మగ్గం దానిని కలిగిన వాడు సాలీడు సాలీడు పురుగు దాని నేత ప్రపంచంలో ఏ క్రిమికేటకం తయారు చేయలేదు అలాగే వస్త్రాన్ని తయారు చేసే వ్యక్తి జీవిత వేదాంతల్ని మొత్తం ఆపోసన పట్టిన వాడు ఒక వస్త్రాన్ని నేయాలంటే పొడుగు పేకా జీవితంలో జయాన్ని చెప్పడం కోసం బారుగ ఆ వస్త్రాన్ని దానిని వస్త్రంగా తయారు చేయడానికి అడ్డంగా పేకను వేస్తాడు అంటే తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలంటే ప్రతిదీ అడ్డంకి గానే ఉంటుంది వాటిని దాటి వెళ్ళగలిగిన సత్తా కలిగిన వాడే శాశ్వతంగా నిలిచి ఉంటాడు ఆ పేరులో ఉన్న మహత్తు అలాంటిది నేసిన బట్టను ఎర్ర రంగులో ముంచి దానిని తామస, రాజస ప్రవృత్తి కలిగిన వారికి కాషాయాన్ని రాజ్యసభ వృత్తి గల వారికి తెలుపును సాత్విక వ్యక్తులకు అందజేయడం ఆయన ధ్యేయం. ఆయన రాసిన ఆటవెలది మకుటం విశ్వదాభిరామ వినురవేమ ద్వారా తన జీవిత ఆశయాన్ని చెప్పిన వాడు. విశ్వము అంటే ప్రపంచాలన్ని కలిసినది దా అంటే ఇవ్వడం. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలను కూలంకషంగా మీకు తెలియ చేశాను. అయితే అది మీకు అర్థం కాదు కనుక వినురవేమ నేను రాశాను కనుక నన్నే వినమని చెప్పుకున్నాను మీరు చదవాలంటే అభిరామ ఒకటికి రెండుసార్లు చదివి మనసు దాని మీదనే కేంద్రీకరించి లోతైన అర్థాన్ని తెలుసుకోవాలి అనుకుంటే దానిలో తాదాప్యం చెందాలి. అప్పుడు కానీ మీకు అర్థం కాదు అని చెప్పాడు వేమన అంత నిర్మోహమోటంగా చెప్పిన కవి మరెవరు లేరు. వారి జయంతిని ప్రతి సంవత్సరం గడపాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని మరొకసారి అభినందిస్తూ...
మీ ఆనంద్,
డా.నీలం స్వాతి.
మీ ఆనంద్,
డా.నీలం స్వాతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి