రెండుమనసుల ఆరాటాలు
ఆగని కడలి కెరటాలు
మనసునిండా మాటలున్నా
మౌనమే మధురం
సాన్నిహిత్యమే సంగీతం
గుండె సవ్వడే సరాగం
చూపులోకనిపించే కోటి ప్రశ్న లు
స్పర్శలో అన్నిటికీ సమాధానాలు
కలిసి ఉన్న ప్రతిక్షణమూ
రసమయం
జగతిలోని అణువణువూ మధుమయం
రెప్పలార్పని చూపులో
ఎప్పటికీ మాయని ప్రేమ
మొదలయితే తుదిలేనిది
తుదికి చేరినా చేయివీడనిది
కలిసిన చేతుల బంధం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి