న్యాయాలు-11
ఇషుకార న్యాయము
*****
ఇషుధి అంటే అమ్ముల పొది.ఇషువు అంటే బాణము.
ఇషుకారము అంటే బాణములు తయారు చేయుట. ఇషుకార న్యాయము అంటే బాణములు తయారు చేయు వ్యక్తికి కేవలం బాణములు తయారు చేయడం తెలుస్తుంది కానీ దానిని ఎలా ఉపయోగించాలో తెలియక పోవడమే.
ఆ పని చేయుటలో మాత్రమే దీక్ష, నైపుణ్యాలు కలిగి ఉండి, దానికి సంబంధించిన ఇతర విషయాల్లో అలాంటి నైపుణ్యం కానీ అవగాహన కానీ వుండక పోవడాన్ని ఇషుకార న్యాయము అంటారు.
పరిశ్రమలు, కర్మాగారాల్లో శ్రామికులు, కార్మికులు అనేక రకాల వస్తువులను తయారు చేస్తారు.అందులో వారికి ఎంత నైపుణ్యం ,ప్రతిభ ఉన్నా వాటిని ఎలా ఉపయోగించాలో తెలియదు.
అలాగే మనం నిత్యం ఉపయోగించే వాహనాల వాడకం తెలుసు కానీ వాటి తయారీ, సాంకేతిక పరిజ్ఞానం తెలియదు.
ఇలా వస్తువులు చేసేవారికి ఉపయోగించడం,ఉపయోగించే వారికి తయారు చేయడం తెలియక పోవడాన్నే ఈ ఇషుకార న్యాయముగా చెప్పుకోవచ్చు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి