"వర్షించే ఆ మేఘమైనా..... !";- కోరాడ నరసింహా రావు !

 పల్లవి :-
      వర్షించే ఆ మేఘమైనా.... 
ఉదయించే ఆ  సూర్యుడైన...., 
  దప్పిక దీర్చే సెలయేరైనా.... 
  ప్రాణము నిచ్చి, కోర్కెలు దీర్చే 
 ఈ కల్ప తరువులైనా.... 
    ప్రతిఫలమునవి... కోరాయా
తమ త్యాగ బుద్దిని వీడాయా.!
     " వర్షించే ఆ మేఘ మైనా.. "
చరణం :-
.      ఓ మనిషీ... నీవింకా.... 
  నీ లోభ బుద్దిని వీడవా.... !
 నీకెన్నో ఇచ్చిన లోకం లో.... 
   హీనుడుగానే బ్రతికేవా.... !!
 నువ్ హీనుడుగానే బ్రతికేవా... 
    " వర్షించే ఆ మేఘమైనా..."
చరణం :- 
         ఎన్ని  జన్మల పుణ్యమో 
మరి  మనిషిగా నువ్ పుట్టావు 
పశువుగమారకమనిషిగ బ్రతికి 
 మహాత్మునిగా ఎదగాలి, నువ్ 
మహాత్మునిగా ఎదగాలీ.... 
 నువ్ మహాత్మునిగా ఎదగాలీ !
     ******
కామెంట్‌లు