ఎవరైనా మొక్కవోని దీక్షతో, పట్టిన పట్టు వదలకుండా ఒక పనిని ప్రారంభించి అది దిగ్విజయంగా పూర్తి చేస్తే దానిని భగీరధ ప్రయత్నం అంటారు. పురాణాలలో ఇటువంటి ప్రయత్నాలు మనకు ఎన్నో కనబడతాయి. వీటి నుండి నేటి మానవాళి స్పూర్తి పొందాల్సిన అవసరం ఎంతో వుంది.భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావలసివచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
షట్చక్రవర్తుల్లో ఒకరైన సగరచక్రవర్తి భగీరథుడు హరిచంద్ర వంశంలో ఎనిమిదోతరంవాడు. బాహకుడి కుమా రుడైన సగరుడు అయోధ్య నగరానికి రాజుగా ఔర్య ముని సహకారంతో చక్రవర్తి అయ్యాడు. ప్రజల క్షేమం కోసం వశిష్టమహాముని ఆజ్ఞానుసారం అశ్వమేధ యాగా నికి సంకల్పించి యాగాశ్వము వెంట తన సంతానమైన అరవైవేలమంది కుమారులను పంపుతాడు. ఇంద్రుడు అశ్వాన్ని తస్కరించి పాతాళలోకంలో తపస్సు చేస్తున్న కపిల మహర్షి చెంత దాన్ని కట్టివేస్తాడు. యాగాశ్వం తప్పి పోవడంతో సమస్త భూమండలాన్ని గాలిస్తారు. అయినా జాడ దొరకక పోవడంతో పాతాళాన్ని తవ్వి చివరకు కపిల ముని దగ్గర అశ్వాన్ని గుర్తించి దాన్ని ఆ ముని కట్టిపడేసి ఉంటాడని భ్రమించి అతని తపస్సును భగ్నం చేస్తారు. దానికి ఆగ్రహించిన కపిలముని ఆ 60 వేల మంది సగరులను తన శాపాగ్నితో భస్మీపటలం చేస్తాడు.
యాగాశ్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకూ తిరిగిరాకపోవడంతో మనుమడు అంశుమంతుని పంపాడు. అంశుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వ లోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతోంటే అశరీరవాణి ''అంశుమంతా, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వ లోకాలు చేరవు. పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతారు'' అంటూ పలికింది.
అంశుమంతుడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటివరకూ భస్మం అయిన రాజకుమారులకు సద్గతి కలగలేదు.
చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భువికి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుని తలచుకుంటూ కఠోర తపస్సు చేశాడు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథా, నీ కఠోర దీక్ష అమోఘం. నీ కోరిక నెరవేరుతుంది. అయితే, ఆకాశం నుండి మహోధ్రుతంగా కిందికి దూకుతుంది గనుక అది తిన్నగా భూమ్మీద పడితే కష్టం.. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో, అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమౌతుంది..'' అన్నాడు.
భగీరథుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన జటాజూటంలో నింపుకొని భూమిపైకి దారలా వదలగా బిందు సరోవరం నుంచి సగరపుత్రులు తవ్విన ఏడుపాయలలో గంగ ప్రవహించింది. పరవళ్లు తొక్కుతూ ప్రవహించే గంగ జాహ్నవి మహర్షి ఆశ్రమాన్ని ముంచెత్తగా ఆగ్రహించిన ముని ఆ గంగను మొత్తంగా తన నోటితో పీల్చి వేస్తాడు. అయితే భగీరథుడు పడ్డ శ్రమను గుర్తించి శాంతించిన ముని చెవుల గుండా గంగను బయటికి వదులుతాడు. సదరు గంగను తన ముత్తాతల భస్మం పై పారించగా శాపవిముక్తులై వారు స్వర్గానికి చేరుతారు. భగీరథుడు ఈ ఘనకార్యాన్ని సాధించి శాశ్వత కీర్తిని పొందాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి