ఓ అక్షర గేయం;--గద్వాల సోమన్న,-ఎమ్మిగనూరు.
ఓ పిక  మెండుగ ఉండాలి
ఓ డలా బ్రతుకు సాగాలి
ఓ టమి నొందిన వారికి
ఓ దార్పునే ఇవ్వాలి

ఓ టి కుండలా ఉండొద్దు
ఓ ర్వలేనితనం  వద్దు
ఓ గిరం మాదిరి మారి
ఓ జోన్ పొర కావాలి

ఓ షధీశుడు అందము
ఓ ష్ఠం అంటే అధరము
ఓ నమాలు నేర్చుకున్న
ఓ లలాడు ప్రతి హృదయము

ఓ లిగ అంటే భక్ష్యము
ఓ లి మామ ఇచ్చు శుల్కము
 ఓ ఘము అనిన సమూహం
ఓ రుగల్లు ప్రసిద్ధ ప్రదేశము


కామెంట్‌లు