అన్యాపదేశ మాధుర్యం.; -తాటి కోల పద్మావతి.

 కొన్ని సందర్భాలలో అసంగతమైన అంశాలపై నిరసన తెలుపవలసి వస్తుంది. కానీ అట్టి వాటిని ముక్కు సూటిగా చెప్పటానికి వీలుండదు. అలాంటప్పుడు మరేదో అడ్డంగా భావాన్ని బహిర్గతం చేయాలి. ఇది దొడ్డి దారి అయినా అందంగా ఉంటుంది. అలెక్ష్యానికి గురైన వాడు కూడా ఆనందిస్తాడు. ఇట్టి వ్యంగ్య వైభవంతో కూడుకున్న కొన్ని మధుర ఘట్టాలను పరిశీలించుదాం.
ఒక అప్రయోజకుడు ఆశ్రయ బలంతో మిడిసిపాటు పడుతున్నాడు. వాడిని ఒక కవి ఈ విధంగా అధిక్షేపిస్తున్నాడు.
పిల్లి! గర్వము చెందబోకు మెద భూభ్రుత్ రత్న గేహాంతరం,
బెల్లన్‌ నీ  దని స్వేచ్ఛగా తిరుగు చురిశాలి పట్టాభిషే,
కోలా సంబున నూరికిన్ బయటగా నున్నట్టి గునేనుగే.
చెల్లును మంగళ మండలంబునకు, ఛీ ఛీ నిన్నెవడెంచునే.
ఏమే పిల్లి! రాజ గృహములో తిరిగినంత మాత్రాన నీవు గొప్పదానివవుతావా? రాజుల పట్టాభిషేక సమయములో ఏనుగుకున్నంత గౌరవం నీకు ఎక్కడిది?
నిన్నెవడు పట్టించుకుంటాడు అన్నది పై పద్య భావం.

కామెంట్‌లు