కొన్ని మాటలు;-- యామిజాల జగదీశ్
కొరికే చెప్పులు కాళ్ళనూ
నటించే బంధాలు జీవితాన్నీ 
"పుండు" చేస్తాయి!

భక్తి అనేది సొంత ఆస్తి
క్రమశిక్షణ అనేది అందరి ఆస్తి
భక్తి లేకుంటే ఏదీ చెడిపోదు
క్రమశిక్షణ లేకుంటే అన్నీ చెడిపోతాయి!

సెల్ ఫోనూ డైరీగా మారింది
ఎవరికీ ఇవ్వలేనంతగా....!

ఒక మనిషి 
చాలా రోజుల తర్వాత చూసినప్పుడు
ఎలా ఉన్నావని మాత్రం పలకరించి
మెలగాలి,  అంతేతప్ప 
నీ పొట్ట పెరిగిపోయిందేమిటీ
జుత్తు రాలిపోయిందేమిటీ
ముసలాడిలా అయిపోయేవేమిటీ అని
మనసు నొప్పించేలా మాట్లాడకూడదు!

కోపం ఆయువు కాస్సేపే
కోపంతో నోరు జారే మాటలు
ఆయుష్షు అధికం!

ఆరోజుల్లో వయస్సుని చూసీ 
వచ్చేది...
ఇప్పుడు వసతులను చూసే
వస్తోంది "మర్యాద"

ఇంటి వైద్యం...

ఆముదంలో ఆవపొడి, పసుపు, కలిపి ఆ తైలాన్ని కాచి భరించగలిగే వేడితో ఆణెలున్న పూస్తే వస్తే ఆణెలు పూర్తిగా తగ్గుతాయి.

చివరగా ఇదో సంగతి...

ప్రపంచంలో అతి పెద్ద హోటల్ రష్యాలోని మాస్కోలో ఉన్న రోసిలా హోటల్.


కామెంట్‌లు