సుప్రభాత కవిత ; -బృంద 
అసాధ్యాలన్నీ అవలీలగా
సాధించాలని

అందలేని తీరాలన్నీ
అందుకోవాలని.

మనసులోని మమతలన్ని
వెలుగుబాట నడవాలని

వేచి ఉన్న విజయాలను
గెలిచి పోగు చేసుకోవాలని

మిగిలిన క్షణాలన్నీ 
మధురంగా మలచుకోవాలని

మోయలేని  బాధలన్ని
మాయమైపోవాలని

కలను కూడా స్వప్నించని
వరమేదో దొరకాలని

మూగబోయిన రాగాలన్నీ
మధుర గానమవ్వాలని

గోరంత కరుణ కోరితే
కొండంత అండ దొరికినట్టు

వెదుకుతూ వచ్చి చేరిన
వెలుగుల  ఉదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు