పల్లవి :-
.మనిషికి జననం - మరణం
సత్యం.... సహజం... !
నడుమ ఉన్న జీవితం....
చిత్రం - విచిత్రం.... !!
బ్రతుకంతా బూటకం.....
ఒక్కొక్కరిదీ ఒక్కో పెద్ద
..నాటకం....పెద్ద నాటకం !
. " మనిషికి జననం.... "
చరణం :-
జన్మ -జన్మల బంధాలు....
పెనవేసుకునీ పుడతారు !
. చెల్లింపులు - వసూళ్లతో
కాలం గడిపేస్తుంటారు!!
.... " జన్మ - జన్మల..... "
అంతటితో ఆగక కొత్త ఖాతాలు
తెరుస్తారు..... !
ఎన్ని జన్మలకైనా వీడని....
చిక్కులలో పడిపోతారూ
..చిక్కులలో పడిపో తారు!!
..... "మనిషి జననం..... "
సాకీ :-
... ఓ.... మనిషీ.... !
ఎన్నాళ్లిలా... ఎన్నేళ్ళిలా....
ఎన్ని !? ఎన్నెన్ని....
.................. జన్మలిలా....
జనన - మరణ... బ్రతుకు
....... యాతనా..... !
" మనిషికి జననం..... "
చరణం :-
నీ నిజరూపం తెలుసుకో
నీ తుది గమ్యం చేరుకో.... !
అందుకు మార్గం చూసుకో
.అమరుడవై నువ్....
. ....... ఆనందముగా....
సత్య శ్వరూపం పొందుకో !
నీ సత్య శ్వరూపం పొందుకో !!
చరణం :-
...జనన -మరణ...బ్రతుకు యాతనలేవీ లేని నీ
స్వ స్వరూపముతో....
దివ్య జ్యోతివై వెలిగిపో...
ఇదియే నిత్యము, సత్యము
సుఖము శాశ్వతానంద మిదియే..... తెలుసుకో..... !
శాశ్వతానంద మిది యే...
........ తెలుసుకో.... !!
*****--*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి