* నెలరాజా.... ! *;- కోరాడ నరసింహా రావు. .
చుక్కల్లో   చక్కనైన నేలరాజా 
నారాజే నాకు గొప్ప నీ కన్నా  

సిరి కి సోదరుడ వీవు నెలరాజా 
అపరమన్మధుడేనోయినారాజు 

ఇరువది ఏడుగురు నీకు 
               నెలరాజా...!
నాకే సొంతము  తెలుసా... 
      ...... నా రాజు.... !!

నీకు  నెలలో పక్షమే కలయిక... 
         నీచుక్కలతో... 

నను వీడి క్షణముండడు  
          . . నా రాజు .. !
 నారాజు... గొప్పేకద నీకన్నా    నాకు నెలరాజా... !!

పెరిగి, తరుగు చుండేవు... 
  తరిగి పెరుగు చుండేవు... 
 నువ్ పూర్ణముగా ఉండేది... నెలకొక్కరోజే కద
       నెలరాజా... !

నా కళ్లముందు ఎల్లప్పుడు  నిండుగానె నారాజు.... 
 
మా జంటను చూసి నువ్వు 
సిగ్గుపడి మబ్బులెనక 
  జారి పోతున్నావా...  నెలరాజా... !
  ******


కామెంట్‌లు