అంకురార్పణం.
అంకురం అంటే మొలక. మొలక వచ్చేదాకా మట్టితో విత్తనాలను ఒక పాత్రలో ఉంచుతారు. రెండు మూడు రోజులకు మొలకలు వస్తాయి. అంకుర-అర్పణం సంప్రదాయమైన అర్థం. నవధాన్యాకురాలను అర్పించడం అని. సాధారణంగా ఒక పనికి పూనుకోవడం ప్రారంభించడం-అంకురార్పణం.
అగస్త్య భ్రాత -అగస్యుడు గొప్ప ఋషి. అతనికి పేరు ఉంది. కానీ అతని తమ్మునికి పేరు లేదు. అన్న పేరు ప్రఖ్యాతులతో పబ్బం గడుపుకొనే వాళ్ళ పట్ల ఈ జాతీయం వాడబడుతుంది. పేరు ప్రఖ్యాతులు లేని వాడిని ఇలా అంటారు. కారణం తన ప్రత్యేకత లేకుండా సోదరునిబట్టి వ్యవహరించబడేవాడు. అగస్త్య మహర్షి సోదరుడు.
సంస్కృత జాతీయాలు.;-సేకరణ తాటి కోల పద్మావతి గుంటూరు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి