రెండు భాషలతో మేలు;-- యామిజాల జగదీశ్
 ఓ ఎలుక తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు బయలుదేరింది.
అప్పుడు దారిలో ఓ పిల్లి అడ్డొచ్చింది.
ఏంట్రా దర్జాగా ఎటు పోతున్నారని అడిగింది పిల్లి.
తల్లి ఎలుక, పిల్ల ఎలుకలూ వణుక్కుంటూ నిల్చున్నాయి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీలేదు.
కానీ తండ్రి ఎలుక ధైర్యంగా ఓ రెండడుగులు ముందుకు వేసింది. అంతేకాదు, భౌ భౌ అంది. దీంతో కంగుతిన్న పిల్లి ముందు వెనుకలు చూడకుండా అక్కడి నుంచి పరుగో పరుగు.
అప్పుడు పిల్ల ఎలుకలు తండ్రి ఎలుకతో "నాన్నా నాన్నా, ఏంటా గొంతు? అసలా అరుపులేంటీ...మన భాష కాదే....ఇంతకుముందెన్నడూ నీ నోటంట వినలేదే...కొత్తగా ఉందా మాట" అన్నాయి.
అయితే తండ్రి ఎలుక చెప్పింది "రెండు భాషలు తెలిసుండటం మంచిదని పెద్దలు అంటూ ఉంటే ఏంటో అనుకున్నాను. కానీ ఈరోజది ఉపయోగపడింది. కనుక పెద్దల మాటెప్పుడూ వృధా పోదు" అంది.
పిల్ల ఎలుకలు ఔనౌనని ముక్తకంఠంతో కీచుకీచుమన్నాయి. 
"అదిగో ఇప్పుడే చెప్పేనా, రెండు భాషలు తెలిసుండటం మంచిదని. కానీ మీరందరూ ఇకమీదట పిల్లి కనిపించడంతోనే భౌభౌ అని అరవడం మరచిపోకండీ. మీకే డోకా ఉండదు" అంది తండ్రి ఎలుక.

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం