" చాందస హస్తం" మారింది చాదస్తం గా,
చాదస్తము, మనకు నచ్చింది,
మనకిష్ట మైనది మరి ఎవ్వరు
చెప్పినా అమలు జరపనిది !!
చెప్పేవారు పదిమంది కానీ
మనకి వినపడవు ఆ మాటలు
మనచెవులు మనకే అంకితం ,
మన మనోనేత్రం మనదే !!
మనసుకి నచ్చచెప్ప,వేరెవ్వరు
ప్రయత్నించినా ,వ్యర్థ ప్రయత్నమే!
ఒక విధముగా మొండితనం కూడా,
తా పట్టీన కుందేటికి మూడేకాళ్ళు అన్నట్టు!
వినబడదు నెవ్వరు చెప్పిన
వింత జన్మ అందుకే మొండి ఘటం,
విపరీతధోరణి, బిరుదులు,
చాదస్తపు జీవి బంక మనీషీ కూడ,!
పట్టువిడుపు లేక పరమార్థం లేదు,
జీవితాన్ని అగమ్యగోచరం చేయడమే
చాదస్తం!!
జీవితం అతుకులబొంత
ప్రతీచిన్న విషయంలో సర్దుకోక తప్పదు,
అప్పుడు నీ మొండితనం,నీ చాదస్తం
విలువ ఎంత!!
లెఖ్ఖకాదు లెక్కించదగు విషయం
మనసున నిలుపు,
జీవితం సుగమం అవ్వాలంటే
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగ పడక, అదియే
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి